హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పూర్ణ బ్రహ్మ శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ 215వ జయంతి నేపథ్యంలో మతువా ధర్మ మేళా నిర్వహణ సందర్భంగా


మతువా సమాజానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు

భక్తి, సమానత్వం, నైతిక జీవనం అనే ఆణిముత్యాలను ఠాకూర్ జీ దివ్య ఆత్మ అందించింది.. ఆ సిద్ధాంతాలు నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలలో నిర్వహించే ‘మతువా ధర్మ మేళా- 2026’ ఈ సిద్ధాంతాల పట్ల మన నిబద్ధతని మరింత బలపరచాలని ఆకాంక్షిస్తున్నా

प्रविष्टि तिथि: 16 MAR 2026 11:37AM by PIB Hyderabad

పూర్ణ బ్రహ్మ శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ 215వ జయంతి సూచకంగా మతువా ధర్మ మేళాను నిర్వహించుకుంటున్న పవిత్ర సందర్భంలో మతువా సమాజానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘పూర్ణ బ్రహ్మ శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ గారి 215వ జయంతి సందర్భంగా మతువా ధర్మ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర సందర్భంలో మతువా సమాజానికి చెందిన మన అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఠాకూర్ గారి దివ్య ఆత్మ మన జ్ఞాన సాగరం నుంచి భక్తి, సమానత్వం, నైతిక జీవనం అనే ఆణిముత్యాల్ని  తెచ్చి మనకు ఇచ్చారు.. అవి ఈ నాటికీ మనకు మార్గదర్శక సిద్ధాంతాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలలో నిర్వహించే ‘మతువా ధర్మ మేళా- 2026’ ఈ సిద్ధాంతాల పట్ల మన నిబద్ధతను మరింతగా బలపరచాలని నేను కోరుకుంటున్నాను’’  అని పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 2240692) आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada