హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, నాగాల్యాండ్‌లతో పాటు కేంద్ర పాలిత జమ్మూ, కాశ్మీర్‌కు రూ.1,912.99 కోట్ల అదనపు సాయం..


కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన గల ఉన్నత స్థాయి సంఘం (హెచ్ఎల్‌సీ) ఆమోదం


వరద, ఆకస్మిక వరద, మేఘ విస్ఫోటం, కొండచరియలు విరిగిపడటం, ‘మొంథా’ పెను తుఫాను కారణంగా 2025 లో ప్రభావితమైన రాష్ట్రాలకీ, కేంద్ర పాలిత ప్రాంతాలకీ అందనున్న కేంద్ర సాయం


ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్లు, గుజరాత్‌కు రూ.778.67 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాల్యాండ్‌‌కు రూ.158.41 కోట్లు, జమ్మూ, కాశ్మీర్‌కు రూ.330.34 కోట్ల సాయానికి హెచ్ఎల్‌సీ ఆమోద ముద్ర


ప్రకృతి విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వాలతో భుజం భుజం కలిపి నిలుస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అవసరమైన అన్ని రకాల సాయాన్నీ అందిస్తున్న కేంద్రం



కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాలకు ఎస్‌డీఆర్ఎఫ్ నుంచి రూ.20,735.20 కోట్లూ, 21 రాష్ట్రాలకు ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి రూ.3,628.18 కోట్లూ విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 11:01AM by PIB Hyderabad

వరదలుఆకస్మిక వరదలుమేఘ విస్ఫోటం,  కొండచరియలు విరిగిపడటం, ‘మొంథా’ పెను తుఫాను ప్రభావానికి లోనైన ఆంధ్రప్రదేశ్ఛత్తీస్‌గఢ్గుజరాత్హిమాచల్‌ప్రదేశ్నాగాల్యాండులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీరు‌కు కేంద్ర అదనపు సాయంగా రూ.1,912.99 కోట్లు అందించనున్నారుకేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సంఘం (హెచ్ఎల్‌సీదీనికి ఆమోదం తెలిపింది.
ఈ మేరకు కేంద్ర సాయాన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్ఎఫ్నుంచి అందించారుఇది సంవత్సరం ప్రారంభ నిల్వ రూపంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్)లో నుంచి 50 శాతం సర్దుబాటుకు లోబడి ఉంటుందిమొత్తం రూ.1,912.99 కోట్లలో నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు రూ.341.48 కోట్లుఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్లుగుజరాత్‌కు రూ.778.67 కోట్లుహిమాచల్‌ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లునాగాల్యాండ్‌‌కు రూ.158.41 కోట్లుజమ్మూకాశ్మీర్‌కు రూ.330.34 కోట్లు మంజూరు చేశారు.
విపత్తులుప్రాకృతిక వైపరీత్యాలు సంభవించిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి నిలబడడంతో పాటుఅవసరమైన అన్ని రకాల సాయాన్నీ అందిస్తోంది.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్నుంచి కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసిన పైన ప్రస్తావించిన నిధులకు అదనంగా ఇచ్చిన సాయమిదిఈ సొమ్మును ఖర్చు చేయడానికి అనువుగా రాష్ట్రాలకు అందజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాలకు రూ.20,735.20 కోట్లను ఎస్‌డీఆర్ఎఫ్ నుంచి విడుదల చేయడంతో పాటు, 21 రాష్ట్రాలకు రూ.3,628.18 కోట్లను ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
అదనంగా, 23 రాష్ట్రాలకు రూ.5,373.20 కోట్లను రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డీఎంఎఫ్నుంచీ, 21 రాష్ట్రాలకు రూ.1,189.56 కోట్లను జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఎంఎఫ్నుంచీ కూడా విడుదల చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2239662) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada