సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్పత్తులకు అద్భుతమైన లేదా అతీంద్రియ గుణాలు ఉన్నాయని పేర్కొనే ప్రకటనల నిషేధానికి అడ్వర్టైజింగ్ కోడ్


వాణిజ్య ప్రకటనలకు అనుమతులు ఇవ్వడానికి ముందు అవసరమైన
సమగ్ర పరిశీలనను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాలు

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 3:28PM by PIB Hyderabad

ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ ప్రకారం, ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే అన్ని ప్రకటనలు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1995   కింద రూపొందించిన నిబంధనల ప్రకారం నిర్దేశించిన అడ్వర్టైజింగ్ కోడ్‌కు లోబడి ఉండాలి. అడ్వర్టైజింగ్ కోడ్‌లోని రూల్ 7(5) ఇతర అంశాలతో పాటు  'ప్రకటించిన ఉత్పత్తికి లేదా దానిలోని ఏదైనా పదార్ధానికి నిరూపించడానికి కష్టతరమైన కొన్ని ప్రత్యేకమైన, అద్భుతమైన లేదా అతీంద్రియ లక్షణం, లేదా నాణ్యత ఉందని ప్రజలు భావించేలా ఎటువంటి ప్రకటనలు ఉండకూడదు' అని స్పష్టం చేస్తోంది.  అడ్వర్టైజింగ్ కోడ్‌లోని ఏ నిబంధననైనా ఉల్లంఘించినట్లు తేలితే  సంబంధిత ప్రైవేట్ టీవీ ఛానళ్లపై తగిన చర్యలు తీసుకుంటారు. అడ్వర్టైజింగ్ కోడ్‌ను కచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ ప్రసారకర్తలకు ఎప్పటికప్పుడు సలహాలు  కూడా జారీ చేస్తుంది.

వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అక్రమ వ్యాపార పద్ధతులు, అసత్యమైన లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన అంశాలను నియంత్రించడానికి,  ఒక వర్గంగా వినియోగదారుల హక్కులను రక్షించడానికి, నిబంధనలు అమలు చేయడానికి వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని సెక్షన్ 10 కింద కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) ను ఏర్పాటు చేశారు. 

కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని సెక్షన్ 18 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అనుమతులను నియంత్రించడానికి ‘‘మార్గదర్శకాలు, 2022"ను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లో తప్పుదారి పట్టించని,  సరైన ప్రకటనల కోసం నిబంధనలు, బైట్ ప్రకటనలు, సరోగేట్ ప్రకటనల నిషేధం, పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ప్రకటనలు, ప్రకటనల్లో డిస్క్లెయిమర్‌లు, అలాగే తయారీదారులు, సేవలందించే సంస్థలు, ప్రకటనదారులు,  ప్రకటన సంస్థల బాధ్యతలు వంటి అంశాలను నిర్దేశించారు.

మార్గదర్శకాల్లోని క్లాజ్ 13 ప్రకారం ప్రకటనలకు మద్దతు (ఎండార్స్మెంట్) ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు.  ప్రకటనలో ఇచ్చే ఏ మద్దతు అయినా అది ఆ వ్యక్తి, సమూహం లేదా సంస్థ నిజమైన,  ప్రస్తుత అభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. అలాగే, సూచిస్తున్న వస్తువు, ఉత్పత్తి లేదా సేవ గురించి తగిన సమాచారం లేదా అనుభవం ఆధారంగా ఉండాలి. అది ఏ విధంగానూ వినియోగదారులను మోసం చేసే విధంగా ఉండకూడదు. ఇంకా ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం భారతీయ నిపుణులు ( తమ వృత్తికి సంబంధించిన ప్రకటనలకు మద్దతు ఇవ్వడానికి నిషేధం ఉంటే - అది భారతదేశంలో నివసించే వారైనా లేదా విదేశాల్లో ఉన్న వారైనా లేదా అలాంటి పరిస్థితిలో అదే వృత్తికి చెందిన విదేశీ నిపుణులు అయినా ఆ ప్రకటనలకు మద్దతు ఇవ్వడానికి అనుమతి ఉండదు.  

ఈ రోజు లోక్‌సభలో శ్రీ డాక్టర్ ఎం.కె. విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాచార, ప్రసార,  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2238444) సందర్శకుల సూచీ సంఖ్య : : 91