సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసార భారతికి చెందిన పీబీ - శబ్ద్ ద్వారా మార్చి 2027 వరకు ఉచితంగా లోగో లేని వార్తలు లభ్యం


1500 మందికి పైగా విలేకరులు, 24 గంటలూ పనిచేసే 60 ఎడిట్ డెస్క్‌ల ద్వారా ప్రతిరోజూ వివిధ రూపాల్లో 1000 కి పైగా వార్తా కథనాలు

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 5:05PM by PIB Hyderabad

మార్చి, 2024లో ప్రారంభమైన ప్రసార భారతి-షేర్డ్ ఆడియో-విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిస్సెమినేషన్ (పీబీ - శబ్ద్) మీడియా సంస్థలకు వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటోల రూపంలో లోగో లేకుండా  రోజువారీ వార్తలను ఉచితంగా అందిస్తోంది. శబ్ద్ ద్వారా ఉచిత సేవలు మార్చి 2027 వరకు కొనసాగుతాయని ప్రసార భారతి ప్రకటించింది.

1500 మందికి పైగా రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, స్ట్రింగర్ల తో కూడిన పటిష్టమైన నెట్‌వర్క్, 24 గంటలూ పనిచేసే 60 ప్రత్యేక ఎడిట్ డెస్క్‌ల ద్వారా పీబీ-శబ్ద్ భారతదేశం నలుమూలల నుంచి  తాజా వార్తలను అందిస్తోంది. ప్రాంతీయ వార్తా విభాగాల నుంచి , ప్రధాన కార్యాలయం నుంచి  వ్యవసాయం, సాంకేతికత, విదేశీ వ్యవహారాలు, రాజకీయ పరిణామాలు వంటి వివిధ విభాగాల్లో ప్రతిరోజూ మొత్తం 1000 వార్తా ప్రసారాలు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అప్‌లోడ్ అవుతాయి. పీబీ-శబ్ద్ ద్వారా లభించే వార్తలు లోగో లేకుండా ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వార్తలను ఉపయోగించుకోవడానికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

పీబీ-శబ్ద్  లైవ్ ఫీడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలు, పురస్కార ప్రదానోత్సవాలు, వివిధ పత్రికా సమావేశాలను లోగో లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సమాచారాన్ని మరింత సులభంగా పొందేందుకు ఒక మీడియా సమాచార భాండాగారం కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా చందాదారులు పాత ఫుటేజీని, ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్యాకేజీలను సులభంగా పొందవచ్చు. ప్రత్యేక ప్యాకేజీలు, ఇంటర్వ్యూలు, భారతదేశం అంతటా రోజువారీ వాతావరణ సమాచారం, ఎడిటోరియల్ కథనాలు పీబీ-శబ్ద్ లో క్రమం తప్పకుండా అప్‌డేట్ అవుతాయి. దీనివల్ల మీడియా సంస్థలు ఈ సమాచారాన్ని వెంటనే వాడుకోవచ్చు. తద్వారా సమయం ఆదా అవుతుంది. మీడియా సంస్థలు shabd.prasarbharati.org సందర్శించి పీబీ-శబ్ద్ లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2237949) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Kannada , Malayalam