హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనాభా లెక్కలు-2027 కోసం డిజిటల్ సాధనాలు, ప్రగతి (మహిళ), వికాస్ (పురుష) మస్కట్‌లను న్యూఢిల్లీలో లాంఛనంగా ఆవిష్కరించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


రెండు దశల్లో జనగణన-2027, ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా లెక్కల కార్యక్రమం


మొదటిసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు: స్వీయ గణనకు తొలిసారి అవకాశం


సురక్షితమైన వెబ్ ఆధారిత ప్రక్రియే స్వీయగణన: ఇంటింటి సర్వే చేపట్టడానికి ముందే 16 భాషల్లో ఆన్లైన్లో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు


2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని నెరవేర్చడంలో స్త్రీపురుషులకున్న సమాన భాగస్వామ్యాన్ని సూచించే జనగణన-2027 మస్కట్‌లు- ప్రగతి, వికాస్


దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన-2027లో పాల్గొనబోతున్న 3 మిలియన్ల ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 1:11PM by PIB Hyderabad

జనగణన-2027 కోసం నాలుగు డిజిటల్ సాధనాలను కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో ప్రారంభించారువీటితో పాటుగా ప్రగతి (మహిళ), వికాస్ (పురుషజనాభా లెక్కల మస్కట్లను కూడా ఆవిష్కరించారుదేశవ్యాప్తంగా గణన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు అధునాతన డిజిటల్ ప్లాట్‌ఫారంలను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్రూపొందించిందికేంద్ర హోం కార్యదర్శిభారతీయ రిజిష్ట్రార్ జనరల్భారత జనాభా లెక్కల కమిషనర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2025 జూన్ 16న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జనగణన-2027ను నిర్వహించాలనే తన ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందిప్రపంచంలోనే అతి జనాభా లెక్కల కార్యక్రమమైన జనగణన-2027 రెండు దశల్లో జరుగుతుందితొలిసారి జనాభాను డిజిటల్ విధానంలో గణిస్తున్నారుఅలాగే మొదటిసారి సెల్ఫ్-ఎన్యూమరేషన్ అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రగతి’, ‘వికాస్’ మస్కట్‌లు

జనాభా లెక్కలు-2027లో స్నేహపూర్వకమైనసుపరిచితమైన ప్రతినిధులుగా ‘ప్రగతి’ (మహిళా ఎన్యూమరేటర్), ‘వికాస్’ (పురుష ఎన్యూమరేటర్మస్కట్‌లను ఆవిష్కరించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చాలనే సంకల్పాన్ని నెరవేర్చడంలో మహిళలుపురుషుల సమాన భాగస్వామ్యానికి చిహ్నాలుగా ఈ మస్కట్‌లు నిలుస్తాయివీటి ద్వారా జనాభా లెక్కలు - 2027కు సంబంధించిన సమాచారంలక్ష్యాలుకీలకమైన సందేశాలను దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో ప్రభావవంతంగా ప్రచారం చేస్తారు.

నాలుగు డిజిటల్ సాధనాలు

డిజిటల్ సాధనాల ద్వారా భారత దేశంలో నిర్వహిస్తున్న మొదటి జనాభా లెక్కలు ఇవి. నాలుగు డిజిటల్ వేదికలను కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారుఅవి:

1. హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ (హెచ్ఎల్‌బీసీవెబ్ అప్లికేషన్: దేశవ్యాప్తంగా భౌగోళిక కవరేజీని అందించేలా ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి డిజిటల్ హౌస్ లిస్టింగ్ బ్లాకులను రూపొందించడానికి అధికారులకు వీలు కల్పించే వెబ్-మ్యాప్ అప్లికేషన్ ఇది

2. హెచ్ఎల్‌వో మొబైల్ అప్లికేషన్: గృహ నమోదు సమాచారాన్ని సేకరించి అప్‌లోడ్ చేయడానికి సురక్షితమైన ఆఫ్‌లైన్ మొబైల్ అప్లికేషన్ ఇదిసీఎంఎంఎస్ ద్వారా రిజిస్టరైన ఎన్యూమరేటర్లు మాత్రమే ఈ అప్లికేషన్‌ను ఉపయోగించగలుగుతారుక్షేత్రస్థాయి నుంచి సర్వర్ వరకు సమాచార సరఫరాకు ఈ యాప్ వీలు కల్పిస్తుందిఅలాగే సంప్రదాయ విధానమైన కాగితపు పనిని తొలగిస్తుందిగృహ నమోదుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఈ యాప్ ద్వారా సేకరిస్తారురిజిస్టర్ మొబైల్ నంబర్లను మాత్రమే ఉపయోగించి దీనిని ఆపరేట్ చేయవచ్చు. 16 ప్రాంతీయ భాషల్లో ఉన్న ఈ యాప్ ఆండ్రాయిడ్ఐవోఎస్ ప్లాట్‌ఫాంలకు అనువుగా ఇది ఉంటుంది.

3. సెల్ఫ్-ఎన్యూమరేషన్ (ఎస్ఈపోర్టల్: మొదటిసారి స్వీయగణనను ప్రవేశపెడుతున్నారుసురక్షితమైన వెబ్ ఆధారిత సౌకర్యమే ఈ ఎస్ఈ పోర్టల్ ద్వారా అర్హులైన వారు తమ ఇంటి సమాచారాన్ని క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఆన్‌లైన్లో సమర్పించడానికి ఇది అనుమతిస్తుందివివరాలు విజయవంతంగా సమర్పించిన తర్వాత ప్రత్యేకమైన సెల్ఫ్-ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్‌ఈ ఐడీజనరేట్ అవుతుంది.ఈ స్వీయ-గణన గుర్తింపు (ఎస్ఈ ఐడీ)ను ఎన్యూమరేటర్‌కు ఇవ్వాలిదీని ఆధారంగా సమాచారాన్ని ఎన్యూమరేటర్ ధ్రువీకరిస్తారు.

4. సెన్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్పోర్టల్: అన్ని పరిపాలనా స్థాయుల్లో జనాభా లెక్కలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల ప్రణాళికనిర్వహణఅమలుపర్యవేక్షణకు సంబంధించిన రూపొందించిన కేంద్రీకృతవెబ్-ఆధారిత డిజిటల్ వేదికఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డు ద్వారా గణన పురోగతిక్షేత్రస్థాయి పని తీరుకార్యాచరణ సంసిద్ధతను సబ్-జిల్లాజిల్లారాష్ట్ర స్థాయుల్లోని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.

జనాభా లెక్కలు-2027లో ఇంటింటికీ వెళ్లి సురక్షితమైన మొబైల్ అప్లికేషన్లతో డేటా సేకరణ జరుగుతుందిఅలాగే పూర్తి స్థాయి కవరేజీకి హామీ లభిస్తుందిదీని కోసం దేశవ్యాప్తంగా 30 లక్షల కంటే ఎక్కువ మంది ఎన్యూమరేటర్లుసూపర్‌వైజర్లుజనాభా లెక్కల అధికారులు పనిచేస్తారు.

క్రమబద్ధంగా స్వీకరించిన సాంకేతికత.. ఆవిష్కరణను సమ్మిళిత్వంతో మిళితం చేస్తుందిఅలాగే జనగణన-2027ను కచ్చితమైనదిగాసురక్షితమైనదిగాసమగ్రంగా ఉండేలా చేస్తుంది.

 

 
జనాభా లెక్కలు-2027 రెండు దశల్లో జరుగుతుంది:

 

మొదటి దశ: హౌస్ లిస్టింగ్హౌసింగ్ లెక్కలు (హెచ్ఎల్‌వో)

మొదటి దశలో ఇంటి పరిస్థితులు, ఇంట్లోని సౌకర్యాలకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతుందిరెండో దశలో దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభాసామాజికఆర్థిక వివరాలు నమోదు చేస్తారు.

2026 జనవరి 7న మొదటి దశకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026 ఏప్రిల్ నుంచి 2026 సెప్టెంబర్ 30 మధ్య ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా హౌస్‌లిస్టింగ్హౌసింగ్ లెక్కలు 30 రోజుల కాల వ్యవధిలో పూర్తి చేస్తారుఇంటింటి సర్వేకు ముందు ఐచ్ఛిక 15 రోజుల స్వీయ-గణన వ్యవధి ఉంటుంది.

రెండో దశ: జనాభా గణన (పీఈ)

2027 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమవుతుందికేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్జమ్ముకాశ్మీర్హిమాచల్ ప్రదేశ్ఉత్తరాఖండ్‌లో మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్‌లోనే ఎన్యూమరేషన్ జరుగుతుందిరెండో దశ జనగణనలో కుల సంబంధిత ప్రశ్నను చేర్చనున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్, జమ్ముకాశ్మీర్హిమాచల్ ప్రదేశ్ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాల్లో తప్పమిగిలిన అన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా లెక్కల రిఫరెన్స్ తేదీ 2027 మార్చి1 00:00 గంటలుగా ఉంటుందిపైనే పేర్కొన్న ప్రాంతాలకు మాత్రం రిఫరెన్స్ తేదీ 2026 అక్టోబర్ 1వ తేదీ 00:00 గంటలుగా ఉంటుంది

***


(రిలీజ్ ఐడి: 2235630) సందర్శకుల సూచీ సంఖ్య : : 223