ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెనడా ప్రధాని పర్యటన రెండు దేశాల మధ్య నిజంగా ఓ సరికొత్త భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేసిందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 10:16PM by PIB Hyderabad

కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటించడం ఈ రెండు దేశాల మధ్య నిజంగా సరికొత్త భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేసిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

నమ్మకం, అభివృద్ది, నవకల్పన, ఉమ్మడి సమృద్ధి తో కూడిన భవిష్యత్తును ఉభయ దేశాల ప్రజలకు అందించడానికి కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కెనడా ప్రధాని పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ -
‘‘ప్రధాని శ్రీ  కార్నీ, మీరు చెప్పింది పూర్తిగా సరైంది. మీ పర్యటన నిజంగానే ఒక సరికొత్త భాగస్వామ్యానికి పటిష్ఠమైన పునాదిని వేసింది.
 నమ్మకం, అభివృద్ది, నవకల్పన, ఉమ్మడి సమృద్ధి తో కూడిన భవిష్యత్తును మన రెండు దేశాల ప్రజలకు అందించడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను.

@MarkJCarney” అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2235262) సందర్శకుల సూచీ సంఖ్య : : 65