హోం మంత్రిత్వ శాఖ
ఆట్టుకల్ పొంగాల పండగ సందర్భంగా కేరళలోని సోదరిణులు, తల్లులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు
ఆట్టుకల్ అమ్మ దీవెనలతో అందరి జీవితాల్లో సిరిసంపదలు నిండి, కోరికలు నెరవేరాలని ఆకాంక్ష
प्रविष्टि तिथि:
03 MAR 2026 3:04PM by PIB Hyderabad
పవిత్ర పండగ ఆట్టుకల్ పొంగాల సందర్భంగా కేరళలోని సోదరిణులు, తల్లులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. "పవిత్ర ఆట్టుకల్ పొంగాల పర్వదినం సందర్భంగా కేరళలోని సోదరిణులు, తల్లులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించే వేళ ఆట్టుకల్ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితం సిరిసంపదలతో నిండి, వారి కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను."
***
(रिलीज़ आईडी: 2235055)
आगंतुक पटल : 93