హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.. ప్రకృతితో మమేకమై జీవితాన్ని గడపాలనే భారత శాశ్వత భావనను పునరుద్ఘాటిద్దామని కోరిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఠీవి ఉట్టిపడే పులి మొదలు అత్యంత చిన్న జాతుల వరకూ.. ప్రతి ప్రాణి మన పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో తన వంతు పాత్రను పోషిస్తోంది

ఈ దినోత్సవం రాబోయే తరాల వారి కోసం వన్యప్రాణుల సంరక్షణ, సంవర్ధన కోసం దేశ ప్రజల సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోంది

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 1:15PM by PIB Hyderabad

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రకృతితో పొందికను ఏర్పరుచుకుంటూ జీవితాన్ని గడపాలనే భారతదేశ శాశ్వత భావనకు పునరంకితం అవుదామని పౌరులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్రకృతితో పొందికను ఏర్పరుచుకొని జీవించాలన్న భారత శాశ్వత భావనను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మనమందరం పునరుద్ఘాటిద్దాం. ఠీవి ఉట్టిపడే పులి మొదలు అత్యంత చిన్న జాతుల వరకూ.. ప్రతి జీవీ మన పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో తన వంతు పాత్రను పోషిస్తోంది. భావి తరాల వారిని దృష్టిలో పెట్టుకొని వన్యప్రాణుల్ని కాపాడడానికి, సంరక్షించడానికి మన సంకల్పాన్ని ఈ వన్యప్రాణి దినోత్సవం బలపరచాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2235031) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam