ప్రధాన మంత్రి కార్యాలయం
“ఆర్థిక వృద్ధి బలోపేతం.. స్థిరత్వం” ఇతివృత్తంగా మార్చి 3న నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 7:10PM by PIB Hyderabad
“ఆర్థిక వృద్ధి బలోపేతం.. స్థిరత్వం” ఇతివృత్తంగా మార్చి 3న నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు.
ఈ ఇతివృత్తం కింద (i) తయారీ, పారిశ్రామిక ఉన్నతీకరణ, వ్యూహాత్మక రంగాలు (ii) ‘ఎంఎస్‌ఎంఈ'లు, ఆర్థిక-మార్కెట్ సౌలభ్యం (iii) నగర ఆర్థిక మండళ్లు (iv) మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు-సరకు రవాణా తదితర రంగాలను స్పృశిస్తూ ఇలాంటి 4 వేర్వేరు వెబినార్లను నిర్వహిస్తున్నారు.
దేశంలో పారిశ్రామిక స్థాయి విస్తృతి, సాంకేతిక నాయకత్వం మరింత పెంపు, కీలక రంగ పునాదుల బలోపేతం వగైరాల దిశగా భవిష్యద్దార్శనిక సంస్కరణల ప్రోత్సాహాన్ని ఈ బడ్జెట్ అనంతర వెబినార్ ప్రముఖంగా వివరిస్తుంది. ఈ ప్రాధాన్యాలను ప్రభావశీల కార్యాచరణగా మలచడంపైనా ఈ వెబినార్‌లో చర్చాగోష్ఠులు దృష్టి సారిస్తాయి. అలాగే పరిశ్రమ భాగస్వాముల ఆలోచనలు మార్గనిర్దేశం చేస్తాయి. అంతేగాక క్షేత్రస్థాయిలో ప్రణాళికలను ప్రభావవంతంగా అలు చేసేందుకు వారి అనుభవం తోడ్పడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2234747)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8