ప్రధాన మంత్రి కార్యాలయం
రూ.2,700 కోట్లకు పైగా ఖర్చుతో పుదుచ్చేరిలో వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, దేశ ప్రజలకు అంకితమివ్వడం, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
01 MAR 2026 6:03PM by PIB Hyderabad
పుదుచ్చేరిలో రూ.2,700 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, దేశ ప్రజలకు అంకితమివ్వడం, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలను
పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను ప్రధాని శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘పుదుచ్చేరిలోని ప్రియ జనావళి మధ్యకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ, అనేక అభివృద్ధి పనులను ప్రారంభించుకొన్నాం.. ఇవి జీవన సౌలభ్యాన్ని పెంచడంతో పాటు, ఈ ప్రాంతంలో ఆర్థిక పురోగతికి తోడ్పడుతాయి.’’
‘‘వణక్కమ్ పుదుచ్చేరి.
పుదుచ్చేరిలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడం కోసం నా అక్క చెల్లెళ్లు, నా అన్నదమ్ముల మధ్యకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీయే డబల్ ఇంజన్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోంది’’.
‘‘గత అయిదు సంవత్సరాలలో, పుదుచ్చేరి రికార్డు స్థాయి అభివృద్ధిని చూసింది. ఈ ప్రగతి.. పుదుచ్చేరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న దార్శనికతకు అనుగుణంగా ఉంది’’.
‘‘ఇదుగో, పుదుచ్చేరిలో యువతకు మేం ఎలా సాధికారితను కల్పిస్తున్నామో.. గమనించండి’’.
‘‘పుదుచ్చేరిని వైద్య పర్యాటకం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ రంగాలకు కూడలిగా తీర్చిదిద్దాలని మేం అభిలషిస్తున్నాం’’.
‘‘ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి సేవ చేయడం కోసం పుదుచ్చేరిని ఒక ఏటీఎమ్‌లా కాంగ్రెస్ మార్చేసింది. ఈ కారణంగా, పుదుచ్చేరి ఎప్పటికీ కాంగ్రెసుకు, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేయదు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2234664)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam