ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్ కేంద్ర ప్రారంభోత్సవం.. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు

నాడు పోస్టు చేయడమైనది: 28 FEB 2026 10:21PM by PIB Hyderabad

గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీకండక్టర్ అసెంబ్లీటెస్టింగ్ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.

‘‘సాంకేతిక రంగంలో నాయకత్వం వైపు భారత్ సాగుతున్న ప్రయాణంలో మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంటు‌ ప్రారంభోత్సవం ఓ కీలక మైలురాయిగా నిలవనుంది’’

‘‘సనంద్‌లోని మైక్రాన్ ఏటీఎంపీ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవడంతో ప్రపంచ సెమీకండక్టర్ వ్యవస్థలో భారత్ ఒక అంతర్భాగంగా మారుతుందిఈ రంగంలో మన పాత్ర మరింత బలోపేతం అవుతుంది.’’

 

‘‘సనంద్‌లోని మైక్రాన్ కేంద్రంలో నేడు భారత్‌ ముందుకు సాగుతున్న తీరు స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.’’

 

‘‘భారత్ సిద్ధంగా ఉందిభారత్ నమ్మదగినదిభారత్ తన లక్ష్యాలను నెరవేరుస్తుంది.’’

 

‘‘ఈ ఏడాది బడ్జెట్‌లో మేం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రకటించాంఇది స్వదేశీ సెమీకండక్టర్ పదార్థాలుబాగాలుసేవలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుంది.’’

‘‘దేశ భాగస్వాములకుప్రపంచ పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నాను.’’

‘‘దేశానికి గర్వకారణమైన రోజు!

 

నేడు సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీకండక్టర్ ఏటీఎంపీ కేంద్రాన్ని ప్రారంభించాం.

ఈ సందర్భంగా కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి...’’


(రిలీజ్ ఐడి: 2234268) సందర్శకుల సూచీ సంఖ్య : : 32