ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కర్మాగారం పేలుడులో ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 MAR 2026 12:09PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక కార్మాగారంలో జరిగిన పేలుడు ఘటనపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారుబాధితులకు స్థానిక ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌నుంచి రూ. 2 లక్షల చొప్పున.. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.

 

ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

‘‘మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన తీవ్రంగా కలిచివేసిందిమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుస్థానిక ప్రభుత్వం బాధితులకు అండగా ఉండి సహాయం అందిస్తోంది.

 

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తాం’’

 

***


(रिलीज़ आईडी: 2234265) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam