హోం మంత్రిత్వ శాఖ
తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్‌ను అభినందించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఈ ప్రాంత యువతకు, ముఖ్యంగా సరికొత్త చరిత్రను లిఖించిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు
ప్రతి పౌరుడూ గర్వంతో ఉప్పొంగే క్షణం
జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకున్న కొత్త మార్పులు యువతకు కొత్త గుర్తింపునిస్తున్నాయనే వాస్తవానికి ఈ విజయం నిదర్శనం
శాంతి, పురోగతి, శ్రేయస్సు మంత్రాలు నవ జమ్మూ కాశ్మీర్ చోదక శక్తి
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2026 6:19PM by PIB Hyderabad
తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టును కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. “జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంలో ఈ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఈ సరికొత్త చరిత్రను లిఖించిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రతి పౌరుడూ గర్వంతో ఉప్పొంగే క్షణం. జమ్మూ కాశ్మీర్‌లో అమలవుతున్న కొత్త మార్పులు అక్కడి యువతకు కొత్త గుర్తింపునిస్తాయనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. శాంతి, పురోగతి, శ్రేయస్సు మంత్రాలు నవ జమ్మూ కాశ్మీర్ చోదక శక్తి”.
(రిలీజ్ ఐడి: 2234082)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4