ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ మరూఫ్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 10:05PM by PIB Hyderabad

జర్నలిజం రంగంలో శ్రీ మరూఫ్ రజా నెలకొల్పిన వారసత్వాన్ని స్మరించుకుంటూ, ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

జర్నలిజం రంగానికి శ్రీ మరూఫ్ రజా ఎన్నో సేవలందించారని ప్రధానమంత్రి కొనియాడారు. రక్షణ రంగం, జాతీయ భద్రత, వ్యూహాత్మక అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహనతో ప్రజా చర్చలను సుసంపన్నం చేశారని తెలిపారు.

రజా గారి మృతి పట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ… కుటుంబసభ్యులకూ, మిత్రులకూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

 

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"జర్నలిజం రంగానికి శ్రీ మరూఫ్ రజా గొప్ప సహకారం అందించారు. రక్షణ రంగం, జాతీయ భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై ఆయనకున్న లోతైన అవగాహనతో ప్రజా చర్చలను సుసంపన్నం చేశారు. వారి మరణం ఎంతగానో కలచివేసింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"

 

***


(రిలీజ్ ఐడి: 2233772) సందర్శకుల సూచీ సంఖ్య : : 90