రైల్వే మంత్రిత్వ శాఖ
సైన్యానికీ, అగ్నివీరులకూ పదవీ విరమణ అనంతరం కెరియర్ అవకాశాలు… ‘సహకార ప్రణాళిక’ను ప్రారంభించిన భారతీయ రైల్వేలు, భారతీయ సైన్యం
లెవెల్-1, లెవెల్-2, అంత కన్న ఎగువన ఉండే పదవుల్లో
మాజీ సైనికులకూ, మాజీ అగ్నివీరులకూ ప్రత్యేక రిజర్వేషన్‌తో పాటు ఉపాధి కల్పనకూ ప్రోత్సాహం
ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయడానికి 5,000 కన్నా ఎక్కువ మంది మాజీ సైనికులను
ఒప్పంద ప్రాతిపదికన పాయింట్స్‌మెన్‌గా నియమించనున్న రైల్వేలు
2024-25లో ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లలో
మాజీ సైనికులకు 14,788 పదవులను రిజర్వు చేసిన రైల్వే
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 6:48PM by PIB Hyderabad
సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాన్ని భారతీయ రైల్వేలు, భారతీయ సైన్యం కలిసి తీసుకుని, ఓ ‘‘సహకార ప్రణాళిక’’ను ముందుకు తెచ్చాయి. అగ్నివీరులకూ, సైనికోద్యోగులకూ పదవీవిరమణ చేసిన తరువాత ఉపాధి అవకాశాల్ని విస్తరించడం ఈ నిర్ణయం ముఖ్యోద్దేశం. ఇది.. వారు సామాన్య పౌరులుగా మెరుగైన జీవనం గడిపే అవకాశాన్ని అందిస్తారు.
సైన్యం నుంచి పౌర సమాజంలో వృత్తిజీవన పథంలోకి సరళమైన రీతిన మార్పు చోటుచేసుకొనేటట్లు చూడటం సైన్యానికీ, రైల్వేల మంత్రిత్వ శాఖకీ చెందిన సీనియర్ నాయకత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం ధ్యేయం. దీంతో రైల్వేలలో ఉపాధి అవకాశాల పట్ల చైతన్యం పెరగనుంది. అంతేకాదు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సాయపడటానికి ఒక ప్రత్యేక సహాయక వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఈ సహకారాత్మక ప్రణాళిక మాజీ సైనికులకు అర్ధవంతమైన రెండో కెరియర్ మార్గాన్ని అందిస్తూ, విస్తృత దేశాభివృద్ధి లక్ష్యాలకు మద్దతివ్వాలన్న ఉమ్మడి నిబద్ధతను కూడా చాటి చెబుతుంది.
మాజీ సైనికులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపాధి అవకాశాలు
పదవీవిరమణ చేసిన సాయుధ బలగాల సిబ్బంది సంక్షేమం, పునరావాసంపై దృష్టి సారించడం భారతీయ రైల్వేల విధానపరమైన ప్రణాళికలో ఒక ముఖ్య అంశంగా ఉంది.
సైనికులుగా, అగ్నివీరులుగా పనిచేసిన వారికి ఉపాధి అవకాశాల్ని కల్పించడం కోసం:
• మాజీ సైనికులకు లెవెల్-2, అంత కన్న ఎగువ పదవుల్లో 10 శాతం, లెవెల్-1 పదవుల్లో 20 శాతం సమతల రిజర్వేషన్లను నిర్ధారించారు.
• దీనికి అదనంగా, లెవెల్-2, అంత కన్న ఎగువ పదవుల్లో 5 శాతం, లెవెల్-1 పదవుల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించారు.
2024, 2025 సంవత్సరాల్లో, రైల్వేల ఖాళీల నోటిఫికేషన్లలో మాజీ సైనికుల కోసం మొత్తం 14,788 పదవులను రిజర్వు చేశారు. వాటిలో:
• లెవెల్-1కి చెందిన 6,485 పదవులు
• లెవెల్-2, అంత కన్న ఎగువ పదవుల్లో 8,303 పదవులు కలిసి ఉన్నాయి.
లెవెల్-1 (ఇదివరకటి గ్రూప్ డి) పదవులకు రైల్వే భర్తీ కేంద్రాలు (ఆర్ఆర్‌సీ) ద్వారా, లెవెల్-2, అంత కన్న ఎగువ పదవులకు రైల్వే భర్తీ మండళ్ల (ఆర్ఆర్‌బీస్) ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి నియామకాలను పూర్తి చేస్తారు.
కాంట్రాక్టు పద్దతి ద్వారా తక్షణ భర్తీ
మాజీ సైనికులను త్వరిత గతిన చేర్చుకోవడాన్ని ప్రోత్సహించడానికీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని పూరించడానికీ రైల్వేల మంత్రిత్వ శాఖ రెగ్యులర్ భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకూ భారతీయ రైల్వేలలో కాంట్రాక్టు ప్రాతిపదికన మాజీ సైనికులను ‘పాయింట్స్‌మెన్’ హోదాలో భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది.
ప్రస్తుతం జోనల్, డివిజనల్ స్థాయులలో 5,000 కన్నా ఎక్కువ లెవెల్-1 పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత వరకూ, 9 డివిజన్లు పాయింట్స్‌మెన్ భర్తీ కోసం సంబంధిత సైన్య సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూస్) కుదుర్చుకుంది.
రైల్వే డివిజన్లతో సైన్య భర్తీ సంస్థలతో చురుకుగా పనిచేస్తూ ఈ పదవులకు నియామకాలను శీఘ్రంగా పూర్తి చేయాలని కూడా సహకారాత్మక ప్రణాళిక సూచిస్తోంది.
దేశ నిర్మాణానికి సామూహిక శక్తులను ఉపయోగించుకోవడం
సర్వీసులో ఉండగా సంపాదించుకున్న అమూల్య నైపుణ్యాలు, క్రమశిక్షణ, సాంకేతిక సామర్థ్యంతో పాటు నాయకత్వ లక్షణాలను భారతీయ రైల్వేలూ, భారతీయ సైన్యమూ ఉపయోగించుకొంటాయి. ఇది దేశ నిర్మాణంలో గొప్ప తోడ్పాటును అందించనుంది. పెద్ద సంఖ్యలో సైనికులు కార్యకలాపాల్లో పాల్గొనడం పరంగానూ, నిర్వహణ పరంగానూ సాపేక్షంగా చిన్న వయసులోనే విశేష అనుభవాన్ని సంపాదించుకొంటారు. తిరుగులేని క్రమశిక్షణనీ, జాతీయవాద భావననీ ఒంటబట్టించుకొని మరీ వారు పదవీ విరమణ చేస్తారు.
భారతీయ రైల్వేలు, భారతీయ సైన్యం మధ్య సహకారం ఆధునిక రవాణా వ్యవస్థతో పాటు సిబ్బంది రాకపోకల్లో కీలక పాత్రను పోషిస్తుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకు వంటి వ్యూహాత్మక మౌలికసదుపాయాల ప్రాజెక్టులు సైనికదళాలనీ, సామగ్రినీ త్వరిత గతిన రంగంలోకి దింపే సామర్థ్యాన్ని ఇదివరకటితో పోలిస్తే బాగా పెంచాయి. గతి శక్తి విద్యాలయంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంటూ నైపుణ్యాన్ని పంచుకొనే కార్యక్రమాలకు కూడా చేయూతను ఇస్తున్నారు.
ఈ ప్రణాళిక ప్రస్తుత భర్తీ వ్యవస్థ పరిధికి లోపలే మాజీ సైనికులు, మాజీ అగ్నివీరుల వ్యవస్థీకృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు దీర్ఘకాలిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమం జాతీయ మౌలిక సదుపాయాలనీ, భద్రత సమన్వయాన్నీ పటిష్ఠపరుస్తూ, సాయుధ దళాలకు చెందిన మాజీ సైనికుల అనుభవం, వారి క్రమశిక్షణ ప్రయోజనాల్ని సద్వినియోగపరుచుకోవాలన్న ప్రభుత్వ నిబద్దతకు అద్దం పడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2233768)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13