ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం... భారతీయ రైల్వే వ్యవస్థలో దాదాపు 307 కిలోమీటర్ల అదనపు లైన్లు


ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 9,072 కోట్లు... 2030-31 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 3:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులకు నేడు ఆమోదం తెలిపిందిఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 9,072 కోట్లుఈ ప్రాజెక్టులు:

  1. గోండియా – జబల్‌పూర్ డబ్లింగ్

  2. పునరఖ్ కియుల్ మూడోనాలుగో వరుస

  3. గమ్హారియా చండిల్ మూడోనాలుగో వరుస

మహారాష్ట్రమధ్యప్రదేశ్బీహార్జార్ఖండ్ రాష్ట్రాల్లోని జిల్లాల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టులతో.. భారతీయ రైల్వే వ్యవస్థ దాదాపు మరో 307 కిలోమీటర్ల మేర పెరగనుంది.

ప్రతిపాదిత మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 98 లక్షల జనాభా ఉన్న దాదాపు 5,407 గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగవుతుంది.

పెరిగిన రైల్వే లైన్ల సామర్థ్యం వల్ల ప్రయాణ వేగం గణనీయంగా పెరుగుతుందిఫలితంగా భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యంసేవల విశ్వసనీయత మెరుగుపడతాయిఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే కాకుండారద్దీని కూడా తగ్గిస్తాయిఈ ప్రాంత సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలను ‘ఆత్మనిర్భరు’లుగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయివారి ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను ఇవి మెరుగుపరుస్తాయి.

సమగ్ర ప్రణాళికభాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ద్వారా.. బహు విధ రవాణా సదుపాయాలనూలాజిస్టిక్ సామర్థ్యాన్నీ పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ బృహత్ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారుఇవి ప్రజలువస్తుసేవల రవాణాలో అంతరాయం లేకుండా మార్గం సుగమం చేస్తాయి.

ఈ సామర్థ్యాభివృద్ధి ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైల్వే రవాణా మెరుగుపడుతుందివాటిలో కచ్నార్ శివాలయం (జబల్‌పూర్), కన్హా జాతీయోద్యానవనం (బాలాఘాట్), గంగుల్పారా డ్యామ్జలపాతంపెంచ్ జాతీయోద్యానవనంధువాంధర్ జలపాతంబర్గి డ్యామ్గోంజీ-సోంజీ ఆలయంచండిల్ డ్యామ్దాల్మా కొండ శిఖరంహెసాకోచా జలపాతంరైజామా ఘాటిదాల్మా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి ఉన్నాయి.

బొగ్గుఉక్కుఇనుప ఖనిజంసిమెంటుబ్యాలస్ట్ కంకర రాళ్లుఫ్లై యాష్ఎరువులుసున్నపురాయిమాంగనీసుడోలమైట్ఆహార ధాన్యాలుపెట్రోలియం చమురు లూబ్రికెంట్లు (పీవోఎల్వంటి సరుకుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమైన మార్గాలుసామర్థ్యాన్ని పెంచేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా 52 మిలియన్ టన్నుల సరకు రవాణా అదనంగా జరుగుతుంది.

రైల్వేలు పర్యావరణ అనుకూలమైనతక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం నడిచే రవాణా సాధనాలు కావడంతో.. వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికీదేశ రవాణా వ్యయాన్ని తగ్గించడానికీ ఈ ప్రాజెక్టులు సహాయపడతాయిదీనివల్ల చమురు దిగుమతులు (6 కోట్ల లీటర్లుతగ్గుతాయికర్బనోద్గారాలు (30 కోట్ల కిలోలుతగ్గుతాయిఇది కోటి చెట్లను పెంచడంతో సమానం.  

 

****


(రిలీజ్ ఐడి: 2232239) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam