ప్రధాన మంత్రి కార్యాలయం
రాజాజీ ఉత్సవాన్ని భారత రాష్ట్రపతి నిర్వహించడం ప్రశంసనీయం: ప్రధానమంత్రి
శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారిని గౌరవించుకోవడం మన భవితను రూపొందించిన వారిని గౌరవించడం, వలసవాద మనస్తత్వ భావాలను తొలగించుకోవడం అనే భారత సంకల్పాన్ని ప్రతిబింబించింది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 FEB 2026 5:12PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ మండపం సమీపంలో గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారిని గౌరవించుకోవడం, వలసవాద మనస్తత్వ భావాలను తొలగించుకోవడమనే భారత్ సంకల్పాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమైన ప్రయత్నంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాజాజీని మహోన్నత పండితుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆలోచనాపరుడిగా, పరిపాలనా దక్షుడిగా అని ఆయన శ్లాఘించారు. ఆయన జీవితం సమగ్రత, మేధస్సు, దేశం పట్ల అచంచల నిబద్ధతలను మూర్తీభవించినదని శ్రీ మోదీ అన్నారు.
రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘రాజాజీ ఉత్సవ్’లో భారత రాష్ట్రపతి పాల్గొన్నారు. రాజాజీ ఉత్సవ్‌లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లో రాజాజీ జీవితం, దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిపై ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
రాజాజీ దేశానికి చేసిన గొప్ప సేవలకు సంబంధించిన విభిన్న అంశాలను వెలుగులోకి తెచ్చే అద్భుతమైన కార్యక్రమంగా రాజాజీ ఉత్సవ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రదర్శనను సందర్శించి ఆయన జీవితం, ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు.
పైన పేర్కొన్న కార్యక్రమాల గురించి భారత రాష్ట్రపతి ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులకు ప్రతిస్పందిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఇది మన భవితను రూపొందించిన వారిని గౌరవించాలనే, వలసవాద మనస్తత్వ భావాలను తొలగించాలనే భారత్ సంకల్పాన్ని ప్రతిబింబించే ప్రశంసనీయమైన ప్రయత్నం.
"రాజాజీ గొప్ప పండితులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఆలోచనాపరులు, పరిపాలనా దక్షులు. ఆయన జీవితం సమగ్రత, మేధస్సు, దేశం పట్ల అచంచలమైన నిబద్ధతలను మూర్తీభవించినది."
"రాజాజీ ఉత్సవ్ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది మన దేశ సంక్షేమం కోసం రాజాజీ చేసిన గొప్ప కృషిలోని విభిన్న అంశాలను వెలుగులోకి తెస్తుంది. మీరంతా దీనిని సందర్శించి స్ఫూర్తి పొందాలని నేను కోరుతున్నాను!"
***
(रिलीज़ आईडी: 2231883)
आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam