ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026


సహకారాత్మక, విశ్వసనీయ, సౌలభ్యమైన, సమర్థమైన ఏఐ కోసం ప్రపంచ ఉమ్మడి దార్శనికతను ఆమోదించిన 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు

కీలక ఫలితాలు: ఏడు కీలక స్తంభాల కోసం ప్రపంచస్థాయి వేదికలు, సూత్రాలు, సహకారాత్మక యంత్రాంగాల ప్రకటన

సమానత్వం, అందుబాటులో ఉండడం, ప్రపంచ సహకారం ఆధారంగా భారత్ నేతృత్వంలో "అందరి కోసం ఏఐ" పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 21 FEB 2026 4:21PM by PIB Hyderabad

ఈ నెల 18–19 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026... కృత్రిమ మేధ రంగంలో ప్రపంచ సహకారాన్ని సాధించడంలో కీలక విజయాన్ని సూచిస్తూఏఐ ప్రభావంపై న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడంతో ముగిసింది.

ఆర్థిక వృద్ధిసామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఉపయోగించడంపై అనేక దేశాలుసంస్థల ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ డిక్లరేషన్‌ను 88 దేశాలుఅంతర్జాతీయ సంస్థలు ఆమోదించాయి.

ఏఐ కోసం ప్రపంచస్థాయి ఉమ్మడి దార్శనికత

సర్వజన హితాయసర్వజన సుఖాయ” (అందరికీ సంక్షేమంఅందరికీ ఆనందంసూత్రం మార్గనిర్దేశంలో రూపొందించిన ఈ డిక్లరేషన్ ఏఐ ప్రయోజనాలు మానవాళికి సమానంగా అందాలని పిలుపునిస్తుంది.

ఇది వీటిని స్పష్టం చేస్తుంది:

• అంతర్జాతీయ సహకారంబహుళ వాటాదారుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం

• జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించడం

• అందుబాటులో ఉండేవిశ్వసనీయమైన విధాన ప్రణాళికల ద్వారా ఏఐని అభివృద్ధి చేయడం

ఏడు స్తంభాల (చక్రాలకార్యాచరణ

ఏఐ రంగం కోసం ప్రపంచస్థాయి సహకారానికి పునాది వేస్తూఏడు కీలక కార్యాచరణ లక్ష్యాల ఆధారంగా ఈ ప్రకటనను రూపొందించారు:

1. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ

2. ఆర్థిక వృద్ధిసామాజిక శ్రేయస్సు

3. సురక్షితమైనవిశ్వసనీయమైన ఏఐ

4. సైన్స్ కోసం ఏఐ

5. సామాజిక సాధికారతను సాధించుట

6. మానవ మూలధన అభివృద్ధి

7. సౌలభ్యమైనసమర్థమైనవినూత్న ఏఐ వ్యవస్థలు

 

ప్రధాన ప్రపంచస్థాయి ఫలితాల ప్రకటన

ఈ సదస్సు స్వచ్ఛందసహకారాత్మక ప్రపంచస్థాయి కార్యక్రమాలను అందించిందిఅవి:

1. ఏఐ ప్రజాస్వామ్యిక విస్తరణ కోసం చార్టర్

• ప్రాథమిక ఏఐ వనరులు సరసమైన ధరకు అందుబాటులో ఉంచుటను ప్రోత్సహిస్తుంది

• స్థానికంగా సంబంధితమైన ఆవిష్కరణ వ్యవస్థలకు మద్దతునిస్తుంది

2. ప్రపంచస్థాయిలో ఏఐ వినియోగ సందర్భాలువనరుల ఏకీకరణ వేదిక

• ఏఐ వినియోగ సందర్భాలను విస్తరిస్తూప్రపంచవ్యాప్తంగా వాటిని పునరుత్పత్తి చేసే ఒక వేదిక

• అభివృద్ధి ప్రభావం కోసం ప్రపంచస్థాయి సహకారానికి వీలు కల్పిస్తుంది

3విశ్వసనీయ ఏఐ కామన్స్

• సాధనాలుప్రమాణాలుఅత్యుత్తమ విధానాల కేంద్ర స్థానం

• సురక్షితమైనవిశ్వసనీయ ఏఐ వ్యవస్థల అభివృద్ధికి మద్దతునిస్తుంది

4. సైన్స్ సంస్థల కోసం అంతర్జాతీయ ఏఐ నెట్‌వర్క్

• ప్రపంచస్థాయిలో శాస్త్రీయ సహకారాన్ని సులభతరం చేస్తుంది

• ఏఐ-ఆధారిత పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది

5. సామాజిక సాధికారత వేదిక కోసం ఏఐ

• జ్ఞానాన్ని పరస్పరం ఉపయోగించుకోవడంసమర్థ పరిష్కారాలను రూపొందించుటకు వీలు కల్పిస్తుంది

• ఏఐ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందించడంపై దృష్టి పెడుతుంది

6. ఉద్యోగులపై ఏఐ ప్రభావాన్ని నావిగేట్ చేసేందుకు ఉపయోగించే మార్గదర్శి, కొత్త నైపుణ్యాలను నేర్పించే సూత్రాలు

• ఏఐ నైపుణ్యాల శిక్షణకొత్త నైపుణ్యాలపై శిక్షణఅవగాహనకు మద్దతునిస్తుంది

• ఏఐ-ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం దేశాలను సిద్ధం చేస్తుంది

7. సౌలభ్యమైనసమర్థవంతమైన ఏఐ కోసం మార్గదర్శక సూత్రాలు

• ఇంధన-సమర్థత గల ఏఐ వ్యవస్థలపై దృష్టి పెట్టడం

• ఏఐ మౌలిక సదుపాయాల సౌలభ్యం కోసం ప్లేబుక్ ద్వారా మద్దతునివ్వడం

ఆర్థిక వృద్ధిసామర్థ్యంపై దృష్టి సారించడం

డిక్లరేషన్ వీటిని ప్రధానంగా ప్రస్తావిస్తుంది:

• ఆర్థిక పరివర్తనను కొనసాగించడంలో ఏఐ పాత్ర

• ఓపెన్-సోర్స్అందుబాటులో గల ఏఐ వ్యవస్థల ప్రాముఖ్యత

• ఇంధన-సమర్థత గల ఏఐ మౌలిక సదుపాయాల అవసరం

• సైన్స్పాలనప్రజా సేవల పంపిణీలో ఏఐ పాత్రను విస్తరించడం

ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం

సదస్సులో పాల్గొన్న దేశాలుసంస్థలు కింది లక్ష్యాల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి:

• ఏఐ పాలనలో ఉమ్మడి ప్రపంచ ప్రాధాన్యాలను మెరుగుపరచడం

• స్వచ్ఛందమైనచట్టపరమైన బాధ్యతలు లేని విధాన ప్రణాళికలను ప్రోత్సహించడం

• నిరంతర సహకారం ద్వారా దార్శనికత కార్యరూపం దాల్చేలా చేయడం

ఈ సదస్సు దీర్ఘకాలిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూఆర్థిక వృద్ధి కోసం ఏఐని కీలక చోదక శక్తిగా నిలుపుతుందని అంచనా వేసింది.

88 దేశాలు,అంతర్జాతీయ సంస్థలు ఆమోదించిన సదస్సు డిక్లరేషన్ ఇక్కడ ఉంది.

అనుబంధం

ఏఐ ఇంపాక్ట్ సదస్సు డిక్లరేషన్

న్యూఢిల్లీ 18-19 ఫిబ్రవరి 2026

ప్రవేశిక

సర్వజన హితాయసర్వజన సుఖాయ” (అందరి సంక్షేమంఅందరి ఆనందంసూత్రం స్ఫూర్తిగా ఏఐ ప్రయోజనాలు మానవాళి అంతటికీ సమానంగా అందినప్పుడే ఏఐ వాగ్దానం ఉత్తమంగా సాకారం అవుతుందని మేం విశ్వసిస్తున్నాం.

దేశాలుఅంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఫిబ్రవరి 192026న న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహించడానికి మేం సమావేశమయ్యాంసాంకేతికత పరిణామ పథంలో ఏఐ ఆగమనం ఒక కీలక మలుపును సూచిస్తుందిఈ రోజు మనం చేసే ఎంపికలు భవిష్యత్ తరాలు వారసత్వంగా పొందే ఏఐ-ఆధారిత ప్రపంచాన్ని రూపొందిస్తాయి.

మానవ మూలధన అభివృద్ధి సూత్రాలు కేంద్రంగా సామాజిక సాధికారతను మరింత అందుబాటులో ఉండేలా చేయడం... ఏఐ వ్యవస్థల విశ్వసనీయత... ఏఐ వ్యవస్థల ఇంధన సామర్థ్యం... సైన్స్ రంగంలో ఏఐ వినియోగం... ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ... ఆర్థిక వృద్ధిసామాజిక శ్రేయస్సు కోసం ఏఐ వాడకం అనే ఏడు చక్రాల (మూలస్తంభాలకోసం మరింత మెరుగైన అంతర్జాతీయ సహకారంబహుళ వాటాదారుల భాగస్వామ్యం అవసరమని ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఆయా దేశాలుఅంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చిందిప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయఇతర కార్యక్రమాలకు అనుబంధంగా... జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ ఏడు చక్రాల (స్తంభాలువ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలను గమనిస్తూమానవాళికి సేవ చేసేలా ఏఐని ఎలా తయారు చేయవచ్చనే విషయంగా ఉమ్మడి అవగాహనను పెంపొందించడానికి మేం కృషి చేస్తాం.

ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ

ఏఐ విస్తరణ కోసందాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలుఅర్థవంతమైనసరసమైన కనెక్టివిటీలు ముందస్తు అవసరాలు. “వసుధైక కుటుంబం” (ప్రపంచమంతా ఒకే కుటుంబంసూత్రం స్ఫూర్తిగా అన్ని దేశాలు తమ పౌరుల ప్రయోజనం కోసం ఏఐని అభివృద్ధి చేయడానికిస్వీకరించడానికిఅమలు చేయడానికి కీలకమైన ఏఐ వనరులను పొందే స్తోమతను మెరుగుపరచడంవాటిని అందరికీ అందుబాటులో ఉంచాల్సిన ప్రాముఖ్యాన్ని మేం గుర్తించాం.

దీని కోసం జాతీయ చట్టాలను గౌరవిస్తూనే ప్రాథమిక ఏఐ వనరులను మరింత అందుబాటులో ఉంచేందుకుస్థానికంగా సంబంధితమైన ఆవిష్కరణలకు మద్దతునివ్వడానికిసమర్థ ఏఐ వ్యవస్థల బలోపేతం కోసం స్వచ్ఛందమైనచట్టబద్ధ నిబంధనల బాధ్యతలు లేని విధాన ప్రణాళికగా ఏఐ ప్రజాస్వామిక విస్తరణ కోసం చార్టర్‌ను మేం రూపొందించాం.

ఆర్థిక వృద్ధిసామాజిక శ్రేయస్సు

ఏఐనిఏఐ-ఆధారిత అప్లికేషన్‌లను విస్తృతంగా స్వీకరించడం అనేది ఆర్థికసామాజిక అభివృద్ధిని నడిపించే అపూర్వ సామర్థ్యం కలిగిఉందిఓపెన్-సోర్స్ ఏఐ అప్లికేషన్‌లుఅందుబాటులో గల ఏఐ విధానాలుసముచితమైన చోట ఏఐ వినియోగ సందర్భాల విస్తృత-స్థాయి విస్తరణ రంగాల్లో ఏఐ వ్యవస్థల గణనీయ ఉపయోగంప్రతిరూపతఅనువర్తన యోగ్యతలకు దోహదపడతాయి.

గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్‌ను స్వచ్ఛంద కార్యక్రమంగా మేం గుర్తించాంఇది అన్ని ప్రాంతాల్లో విజయవంతమైన ఏఐ వినియోగ సందర్భాలను స్వీకరించడంపునరుత్పత్తి చేయడంస్థాయిని పెంపొందించుటను ప్రోత్సహించడానికిప్రారంభించడానికి ఒక ఆచరణాత్మక వేదికను అందిస్తుంది.

సురక్షితమైనవిశ్వసనీయమైన ఏఐ

నమ్మకాన్ని కలిగించడానికిసామాజిక-ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడానికి సురక్షితమైనవిశ్వసనీయమైనదృఢమైన ఏఐని అభివృద్ధి చేయడం పునాది అవుతుందిసంభావ్య భద్రతా అంశాలపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడం ముఖ్యమైనదని గమనించడం సహా... ఏఐ వ్యవస్థల్లో భద్రతపరిశ్రమ ఆధారిత స్వచ్ఛంద చర్యలుసాంకేతిక పరిష్కారాల అమలుఏఐ జీవితచక్రం అంతటా ప్రజా ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ఆవిష్కరణలకు వీలు కల్పించే తగిన విధాన ప్రణాళికల ప్రాముఖ్యాన్నీ మేం గుర్తించాం.

అందరూ తమ సందర్భాలకు అలాగే దాని స్వచ్ఛంద మార్గదర్శక నోట్‌కు అనుగుణంగా వినియోగించగలస్వీకరించగల సాంకేతిక వనరులుసాధనాలుప్రమాణాలుఉత్తమ పద్ధతులను ఏకీకృతం చేసే సహకార వేదికగా స్వచ్ఛందమైనచట్టబద్ధ నిబంధనల బాధ్యత లేని విశ్వసనీయమైన ఏఐ కామన్స్ అభివృద్ధినీ మేం గుర్తించాం.

సైన్స్

ఏఐ పరిశోధన మౌలిక సదుపాయాలకు నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించడంలభ్యతను పెంచడం వల్ల ఆయా దేశాల్లో శాస్త్రీయ పరిశోధనఅభివృద్ధిలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని మేం గుర్తించాంఅంతర్జాతీయ శాస్త్రీయ సహకారాలు ప్రత్యేకమైన నైపుణ్యందృక్పథాలువనరులను అందుబాటులో ఉండేలా చేయగల సామర్థ్యం కలిగి ఉండడం ద్వారా పరిశోధనఅభివృద్ధిలో ఏఐ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలవు.

ప్రభావవంతమైన ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికిభాగస్వామ్య సంస్థలు ఉన్న ప్రాంతాల్లో శాస్త్రీయ సంఘాలను అనుసంధానించడానికిసైన్స్ సంస్థలు ఏఐ పరిశోధన సామర్థ్యాలను సమీకరించడానికి ఒక వేదికగా స్వచ్ఛందసహకార అంతర్జాతీయ ఏఐ నెట్‌వర్క్‌నూ మేం గమనించాం.

సామాజిక సాధికారత కోసం వినియోగం

జ్ఞానాన్నివివిధ దేశాల పరిష్కారాలుసమాచారంసేవలుఅవకాశాలను ప్రజలందరూ సమానంగా వినియోగించుకునేలా చేయడం ద్వారాసామాజిక-ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ఏఐ కలిగి ఉందిసామాజిక సాధికారత కోసం ఏఐ స్వీకరణను సులభతరం చేసే సహకారాల ప్రాముఖ్యాన్నీ మేం గుర్తించాం.

సామాజిక సాధికారత కోసం ఏఐ స్వీకరణను ముందుకు తీసుకెళ్లడానికి అభ్యసనంజ్ఞానంగణనీయ ప్రభావం గల పద్ధతులను పరస్పరం పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి స్వచ్ఛందసహకార వేదికను అభివృద్ధి చేయడం అవసరమని మేం గమనించాం.

మానవ మూలధనం

ఏఐ పూర్తిస్థాయి వాగ్దానాన్ని గ్రహించడం కోసం ఏఐ మానవ వనరుల అభివృద్ధిని విస్తరించడంవిద్య విషయంలో నిర్దిష్ట కార్యక్రమాలనుఏఐ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడంప్రభుత్వ అధికారులకు శిక్షణనివ్వడంఏఐ సామర్థ్యాల గురించి ప్రజల్లో అవగాహనను పెంపొందించడంఏఐ అవగాహనను విస్తరించడంఅలాగే వృత్తిశిక్షణ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వ్యక్తులను సంబంధిత నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం అవసరం.

అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధికొత్త నైపుణ్యాలపై శిక్షణనిచ్చే ఏఐ కార్యక్రమాల విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తూనేఏఐ యుగంలో నూతన నైపుణ్యాల అభ్యసనం కోసం స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాలనుభవిష్యత్ ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సన్నద్ధమయ్యే భాగస్వాములకు మద్దతునిచ్చే ఏఐ శ్రామిక శక్తి అభివృద్ధిపై ప్లేబుక్‌ను మేం రూపొందించాం.

సౌలభ్యంఆవిష్కరణసామర్థ్యం

ఇంధనంమౌలిక సదుపాయాలుసహజ వనరులపై పెరుగుతున్న ఏఐ డిమాండ్లను గుర్తిస్తూ... ఇంధన సామర్థ్యం గల ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యాన్ని మేం స్పష్టం చేశాంసరసమైన ఏఐ వ్యవస్థలు ఏఐని మరింత అందుబాటులోకి తీసుకువస్తాయిఉమ్మడి అభివృద్ధి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లే స్థానిక ఆవిష్కరణలను వేగవంతం చేస్తాయి.

సౌలభ్యం గలవినూత్నమైనసమర్థవంతమైన కృత్రిమ మేధ గురించిన స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాలు సౌలభ్యం గలసమర్థమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధి దిశగా మనకు మార్గనిర్దేశం చేస్తాయని మేం గుర్తించాంసౌలభ్యంతో కూడిన ఏఐ మౌలికవసతుల అభివృద్ధి గురించిన ప్లేబుక్‌ను మేం జ్ఞానాభివృద్ధికి ఫలితంగా గుర్తించాంఇది సౌలభ్యంతో కూడిన ఏఐ అభివృద్ధికి మద్దతునిచ్చే సూచనాత్మక వనరు.

ముగింపు                                                                                                       

ఏఐ ఇంపాక్ట్ సదస్సు... అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికిభాగస్వామ్య ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడానికి బహుళ వాటాదారుల విధానాన్ని అలాగే స్వచ్ఛందమైనచట్టబద్ధమైన నిబంధనల బాధ్యతలేని మార్గదర్శకాలుసూత్రాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని మేం గుర్తించాంఇది మానవాళికి సుసంపన్న భవిష్యత్తును నిర్ధారించడానికి ఏఐని ప్రోత్సహించగలదు.

ఏఐ ప్రయోజనాలను సాకారం చేసుకోవాలనే మా ఉమ్మడి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడానికి మేం కట్టుబడి ఉన్నాంఈ ఆకాంక్షలను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 మూడు సూత్రాల కోసం ధృడమైన చర్యలుగా అనువదించడానికి నిరంతర సహకారం కోసం మేం ఎదురుచూస్తున్నాం.

ఆమోదం తెలుపుతున్న దేశాలు/అంతర్జాతీయ సంస్థలు:

 

1.      Albania

24. Finland

47. Malta

70. Singapore

2.      ⁠Armenia

25. France

48. Mauritius

71. Slovakia

3.      ⁠Australia

26. Gambia

49. Mexico

72. Slovenia

4.      ⁠Austria

27. Germany

50. Morocco

73. South Korea

5.      ⁠Belgium

28. Greece

51. Mozambique

74. Spain

6.      ⁠Bhutan

29. Guyana

52. Myanmar

75. Sri Lanka

7.      Bolivia

30. Hungary

53. Nepal

76. Suriname

8.      ⁠Botswana

31. Iceland

54. Netherlands

77. Sweden

9.      Brazil

32. India

55. New Zealand

78. Switzerland

10.  ⁠Bulgaria

33. Indonesia

56. Norway

79. Tajikistan

11.  ⁠Cambodia

34. Iran

57. Oman

80. Tanzania

12.  ⁠Canada

35. Ireland

58. Paraguay

81. Trinidad and Tobago

13.  ⁠Chile

36. Israel

59. Peru

82. UAE

14.  ⁠China

37. Italy

60. Philippines

83. Ukraine

15.  ⁠Croatia

38. Japan

61. Poland

84. UK

16.  ⁠Cuba

39. Kazakhstan

62. Portugal

85. USA

17.  ⁠Cyprus

40. Kenya

63. Romania

86. Uzbekistan

18.  ⁠Czech Republic

41. Kyrgyzstan

64. Russia

87. EU

19.  ⁠Denmark

42. Latvia

65. Rwanda

88. IFAD

20.  ⁠Egypt

43. Liechtenstein

66. Saudi Arabia

 

21.  ⁠Estonia

44. Lithuania

67. Senegal

 

22.  ⁠Ethiopia

45. Luxembourg

68. Serbia

23.  ⁠Fiji

46. Maldives

69. Seychelles

 

***


(రిలీజ్ ఐడి: 2231598) సందర్శకుల సూచీ సంఖ్య : : 7