ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్‌ జాతికి అంకితం


ఉత్తరప్రదేశ్ తో పాటు దేశమంతా ఈ రోజు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సరికొత్త యుగాన్ని చూస్తోంది: ప్రధానమంత్రి

మీరట్ మెట్రో, నమో భారత్ రైలు, రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కొత్త సెక్షన్ ప్రారంభం ద్వారా ఎన్సీఆర్ ప్రజల జీవితాలు ఇంకా సులభంగా, సాఫీగా, సౌకర్యవంతంగా మారతాయి: ప్రధాని

ఒకసారి ఏదైనా పనికి శంకుస్థాపన జరిగితే, దానిని రేయింబవళ్లు శ్రమించి పూర్తి చేయడం మా పని సంస్కృతి: అందుకే ఇప్పుడు ప్రాజెక్టులు గతంలో మాదిరి పెండింగ్‌లో ఉండవు: ప్రధాని

నమో భారత్ లేదా మెట్రో సర్వీస్ ఏదైనా, రెండింటికీ శంకుస్థాపన చేసే అవకాశం నాకే దక్కింది - ఈ రోజు వాటిని ప్రారంభించే భాగ్యం కూడా నాకే కలిగింది: ప్రధాని

నమో భారత్, మెట్రో రైలు ఒకే స్టేషన్‌లో, ఒకే ట్రాక్‌పై నడవడం దేశంలో ఇదే తొలిసారి: ప్రధాని

ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి నగరంలోకోి ప్రయాణించవచ్చు, అదే స్టేషన్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి రావచ్చు: ప్రధానమంత్రి

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ రోజు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి: ప్రధాని

ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నాయి… అవి తమ భవిష్యత్తును భారత్ అభివృద్ధిలో చూస్తున్నాయి; అలాగే భారత యువశక్తిలో విశ్వాసాన్ని చూస్తున్నాయి: ప్రధాని

నేడు ప్రపంచం 21వ శతాబ్దపు సవాళ్లకు పరిష్కారాలు చూపగల శక్తిగా భారత్‌ను భావిస్తోంది: ప్రధాని

మీరట్-హాపూర్ ప్రాంతం, ఇంకా దాని చుట్టుపక్కల ప్రాంతాలు మొదటి నుంచీ చౌదరి చరణ్ సింగ్ దార్శనికతను చూశాయి... చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అందించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం మా అదృష్టం: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 FEB 2026 4:47PM by PIB Hyderabad

మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారుఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారుభారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.

 

ఈ ప్రాజెక్ట్ వికసిత భారత్‌లో అనుసంధానత ఎలా ఉంటుందనే ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఈ సమీకృత వ్యవస్థ నగరంలో ప్రయాణానికి మెట్రోనుట్విన్ సిటీస్ దార్శనికతను వేగవంతం చేయడానికి నమో భారత్ రైళ్లను ఉపయోగిస్తుందిడబుల్ ఇంజన్ ప్రభుత్వ పని సంస్కృతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూప్రాజెక్టులు ఇకపై గతంలో లాగా మధ్యలో నిలిచిపోవని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుతాము శంకుస్థాపన చేసిన పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారుఈ ప్రాజెక్టుల శంకుస్థాపనప్రారంభోత్సవం రెండింటినీ తామే స్వయంగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

తమ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మీరట్ మెట్రోలో ప్రయాణించి విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారురైలు ఆపరేటర్లుస్టేషన్ నియంత్రణ సిబ్బందిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని పేర్కొంటూఈ ప్రాజెక్టును 'నారీ శక్తి'కి చిహ్నంగా ప్రధానమంత్రి కొనియాడారుదేశంలోనే తొలి నమో భారత్ రాపిడ్ రైల్ సేవలు ప్రారంభమైన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

 

మీరట్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 2014, 2019, 2024 జాతీయ ఎన్నికల ప్రచారాలన్నీ ఈ విప్లవ గడ్డ నుంచే నుండే ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారునిరంతర ఆశీస్సులు అందిస్తున్న ఈ ప్రాంత రైతులకుకళాకారులకుపారిశ్రామికవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. "2014 కంటే ముందు మెట్రో సేవలు కేవలం నగరాల్లో మాత్రమే ఉండేవికానీ ఇప్పుడు 25 కంటే ఎక్కువ నగరాల్లో మెట్రోలు నడుస్తున్నాయిఇది భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలబెట్టిందిఅని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఈ ప్రాజెక్ట్ లో సారాయ్ కాలే ఖాన్ఆనంద్ విహార్ఘజియాబాద్మీరట్ వద్ద భారతీయ రైల్వేలుమెట్రో ఇంకా బస్సు స్టాండ్‌ల అనుసంధానం ఒకప్రత్యేకతభారతదేశంలో తొలిసారిగా నమో భారత్ మెట్రో రైలు ఒకే ట్రాక్ఒకే స్టేషన్‌లో నడుస్తాయిఅని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారుఈ అనుసంధానం వల్ల ప్రయాణికులు నగరం లోపల ప్రయాణించవచ్చు లేదా నేరుగా ఢిల్లీకి వెళ్లవచ్చుతద్వారా చాలా మంది కార్మికులువిద్యార్థులు ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉండాల్సిన అవసరం తప్పుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

ఎక్స్‌ప్రెస్‌వేలుఫ్రైట్ కారిడార్లుజేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ఆధునిక మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడులు అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయిఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలనువ్యాపారాలను ఆకర్షిస్తున్నాయిఅని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

ఉత్తరప్రదేశ్ శ్రమకు, సృజనకు నిలయమని అభివర్ణిస్తూరాష్ట్ర రైతులుకళాకారులు వారసత్వం అభివృద్ధి మంత్రాన్ని విజయవంతంగా సాకారం చేస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారుభారత ప్రపంచ శక్తి పెరుగుతున్న కొద్దీభారత యువశక్తిని ఉపయోగించుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. "నేడు ప్రపంచం 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించగల శక్తిగా భారత్‌ను చూస్తోందిదీనివల్ల ఉత్తరప్రదేశ్ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందిఅని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని కేటాయించినట్లు ప్రధానమంత్రి చెప్పారుఇది ఎం ఎస్ ఎం ఈలకు రుణాలు సులభంగా అందేలా చేస్తుందినేత కార్మికులు అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరువయ్యేలా సహాయపడటానికి ఉద్దేశించిన 'మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ యోజనగురించి కూడా ఆయన ప్రస్తావించారుకొరియర్ ద్వారా వస్తువులను పంపడంపై ఉన్న రూ. 10 లక్షల పరిమితిని తొలగించామనిదీనివల్ల మీరట్ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్న చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా నేరుగా అమెరికాయూరప్‌లోని వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

"చౌదరి చరణ్ సింగ్ దార్శనికతను గౌరవిస్తూప్రభుత్వం ఆయనకు భారతరత్నను అందజేసిందిఆయన స్ఫూర్తితోఫుడ్ ప్రాసెసింగ్పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తోందిఈ పథకం కింద ఉత్తరప్రదేశ్ రైతులకు ఇప్పటికే దాదాపు 95,000 కోట్ల రూపాయలు అందాయి” అని శ్రీ మోదీ తెలిపారు.

 

ఉత్తరప్రదేశ్ అభివృద్ధి అత్యంత ప్రధానమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు అల్లర్లునేరాలకు నిలయంగా ఉన్న రాష్ట్రంనేడు బ్రహ్మోస్ క్షిపణులుమొబైల్ తయారీపర్యాటక రంగాలకు గుర్తింపు పొందుతోందని ఆయన పేర్కొన్నారునేడు నేరస్థులు జైళ్లలో ఉన్నారనిఆడబిడ్డలు గౌరవంతో ఉన్నారనిమెరుగుపడిన శాంతిభద్రతలు రాష్ట్రంలో భారీ ఆర్థిక వృద్ధికితయారీ రంగ విస్తరణకు దారితీశాయని ఆయన తెలిపారు.

 

ఉత్తరప్రదేశ్ ఒక తయారీ కేంద్రంగా మారుతోందిఇటీవలే రాష్ట్రంలోని మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగిందివికసిత భారత్ సాకారం కావాలంటే వికసిత ఉత్తరప్రదేశ్ అత్యవసరంఅని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

***


(రిలీజ్ ఐడి: 2231590) సందర్శకుల సూచీ సంఖ్య : : 7