ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు 2026 సందర్భంగా స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ గై పార్మెలిన్ తో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 6:29PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు.

భారత్‌స్విట్జర్లాండ్ మధ్య ఉన్న స్నేహపూర్వకబహుముఖ సంబంధాలను ఇరు దేశాల నేతలూ పునరుద్ఘాటించారువాణిజ్యంపెట్టుబడులుశాస్త్రీయంసాంకేతికతఆవిష్కరణలునైపుణ్యాభివృద్ధిసంస్కృతిప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక అంశాలన్నింటినీ సమీక్షించారుప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడంపై ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారుఇటీవల ముగిసిన చారిత్రాత్మక భారత్ ఈఎఫ్‌టీఏ వాణిజ్యఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పురోగతిపై చర్చించారుఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్ కీలక సభ్య దేశంరెండు దేశాల మధ్య వాణిజ్యంపెట్టుబడుల ప్రవాహాన్ని గణనీయంగా పెంచడానికి టీఈపీఏ ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

 

శిక్షణనైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణల ఆధారిత వృద్ధిఉమ్మడి పరిశోధనలుఉత్తమ పద్ధతుల భాగస్వామ్యంసామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయిభారత్స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే ఉమ్మడి లక్ష్యంతో ఈ సమావేశం ముగిసింది.

 

తదుపరి ఏఐ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాలనే స్విట్జర్లాండ్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారుస్విట్జర్లాండ్ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ సదస్సును నిర్వహించనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2230500) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Malayalam