హోం మంత్రిత్వ శాఖ
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. వందనాలర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హైందవ స్వరాజ్ ప్రతిష్ఠాపనకు చిన్న వయసులోనే ప్రతినబూనిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. ధర్మ ధ్వజ పరిరక్షణకు జీవిత పర్యంతం కట్టుబడ్డారు
దేశం నలుమూలలా సదా స్వధర్మం, స్వరాజ్యం, స్వభాష పరిరక్షణకే జీవించే, మరణించే శాశ్వత సంకల్పాన్ని జాగృతం చేశారు శివాజీ మహారాజ్
దేశ ప్రజల్నీ దేశ సంస్కృతినీ రక్షించే ఏకైక ధ్యేయంతో సమాజంలో ప్రతి వర్గాన్నీ శివాజీ మహారాజ్ సంఘటితం చేసి, అపార సైన్యాన్ని నిర్మించారు
ఆయన దృఢ ఇచ్ఛాశక్తి, అజేయ సాహసం, ఊహకందని వ్యూహరచన నైపుణ్యం చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి
प्रविष्टि तिथि:
19 FEB 2026 11:12AM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు ప్రణామం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవీ స్వరాజ్ స్థాపనకు చిన్న వయసులోనే ప్రతిజ్ఞ చేశారని, ధర్మ ధ్వజ పరిరక్షణకు జీవిత పర్యంతం కట్టుబడి ఉన్నారని అన్నారు. దేశంలో ప్రతి ప్రాంతంలోనూ స్వధర్మాన్నీ, స్వరాజ్‌నీ, స్వభాషనీ నిలబెట్టడం కోసమే జీవించి మరణించాలన్న శాశ్వత సంకల్పాన్ని జాగృతపరిచారన్నారు. దేశ ప్రజలనీ, దేశ సంస్కృతినీ పరిరక్షించే ఏకైక ధ్యేయంతో సమాజంలో ప్రతి వర్గాన్నీ శివాజీ మహారాజ్ సంఘటిత పరిచి, అపార సైన్యాన్ని నిర్మించారని శ్రీ షా అన్నారు. ఆయన దృఢ సంకల్పం, అజేయ ధైర్య సాహసాలు, ఊహకు అందని ఆయన వ్యూహరచన నైపుణ్యం చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి అని మంత్రి అన్నారు.
(रिलीज़ आईडी: 2230178)
आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam