ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రిని కలిసిన సెర్బియా అధ్యక్షుడు

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 3:40PM by PIB Hyderabad

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు సెర్బియా అధ్యక్షుడు శ్రీ అలెక్సాండర్ వుచిక్ భేటీ అయ్యారు.

రక్షణ, తయారీ రంగం, డీపీఐ, ఎరువులు, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస మార్గాలపై ఇరువురు నాయకులు చర్చించారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వేర్వేరు పోస్టుల్లో ఇలా పేర్కొన్నారు.

‘‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిక్‌ను కలిశాను. రక్షణ, తయారీ, డీపీఐ, ఎరువులు మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై మేం చర్చించాం. అనేక సంవత్సరాలుగా భారత్ సెర్బియా కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే కాలంలో మా సంబంధాలు మరింత ఊపందుకుంటాయని నేను నమ్ముతున్నాను
@avucic’’.


(రిలీజ్ ఐడి: 2229676) సందర్శకుల సూచీ సంఖ్య : : 87