సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026: భారతదేశపు అగ్రశ్రేణి ఏఐ ఆవిష్కరణల కార్యస్థలిగా ఆవిర్భవించిన ఎంఐబీ పెవిలియన్


ఏఐ గేమింగ్ ల్యాబ్స్ నుంచి ఏజెంటిక్ న్యూస్‌రూమ్‌ల వరకు... 'వేవ్స్' సదస్సులో

వాస్తవ ప్రాపంచిక ఏఐ వినియోగాన్ని చాటిచెప్పిన అడోబ్, భారత్‌జెన్, కుకు ఎఫ్ఎం

వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారద ముని ఏర్పాటు, ఏఐ థియేటర్, భారత్‌జెన్ బూత్

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 7:20PM by PIB Hyderabad

వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌ను కేవలం ఒక ప్రదర్శనశాలగా మాత్రమే కాకుండా పూర్తిస్థాయిలో పనిచేసే ఒక ప్రత్యక్ష ఆవిష్కరణల కార్యస్థలిగా రూపొందించారుఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్వీఎఫ్ఎక్స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాలిటీరంగాల్లో కృత్రిమ మేధ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రత్యక్షంగా ప్రదర్శించడమే దీని ప్రధాన ఉద్దేశంసందర్శకులు ఇక్కడి సాంకేతికతతో స్వయంగా మమేకమై సరికొత్త అనుభూతిని పొందేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు.

ఈ విభాగం 'వేవ్స్సదస్సుకు వ్యూహాత్మక పొడిగింపుగా పనిచేస్తుందిముఖ్యంగా ఇందులోని కీలక విభాగాలైన వేవ్ ఎక్స్ వేవ్స్ బజార్, 'క్రియేట్ ఇన్ ఇండియాఛాలెంజ్‌లకు ఇది ఒక వేదికగా నిలుస్తోందిఇందులో 'వేవ్ ఎక్స్అంకురాలు తమ వినూత్న ప్రదర్శనలుప్రత్యక్ష ఏఐ అప్లికేషన్ల ద్వారా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అభివృద్ధి చెందుతున్న కొత్త ఆవిష్కర్తలతో పాటు అడోబ్నెట్‌ఫ్లిక్స్సోనీకలెక్టివ్ఇన్‌షార్ట్స్కుకు ఎఫ్ఎంవిస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ అంతర్జాతీయభారతీయ సంస్థలు అత్యంత ఆధునిక ఏఐ సాధనాలనువిప్లవాత్మక మీడియా సాంకేతికతలను ఈ వేదికపై ప్రదర్శించనున్నాయి.

ముఖ్యమైన ఆకర్షణలు

ఏఐ గేమింగ్ ల్యాబ్:

సందర్శకులు నేడు ఇక్కడ కృత్రిమ మేధ ఆధారిత గేమ్ అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించారుఒక ఆలోచన పుట్టినప్పటి నుంచి ఆడేందుకు వీలైన ఒక ప్రోటోటైప్ రూపొందే వరకు జరిగే ప్రక్రియను వారు స్వయంగా చూశారుఅలాగే ఈ ఇంటరాక్టివ్ గేమింగ్ ల్యాబ్ వాతావరణంలో ఏఐ ద్వారా తయారు చేసిన వీడియో గేమ్స్‌ను ఆడారురాబోయే రోజుల్లో కూడా ఈ ఏఐ గేమింగ్ ల్యాబ్ ప్రత్యక్ష ప్రదర్శనలుచర్చా కార్యక్రమాలను కొనసాగిస్తుంది.

ఏఐ కంటెంట్ క్రియేషన్ ల్యాబ్ (అడోబ్ సౌజన్యంతో):

ఈ లైవ్ స్టూడియో వేదికపై ఏఐ ఆధారిత చలనచిత్ర నిర్మాణ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారుఇక్కడ కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ద్వారా స్ర్కిప్టులుదృశ్యాలుసినిమా సన్నివేశాలు నిజ సమయంలో ఎలా రూపొందుతాయో వివరించారుఇది డిజిటల్ స్టోరీటెల్లింగ్ విధానాన్ని సరికొత్తగా మారుస్తోందిరాబోయే రోజుల్లో కూడా ఈ ల్యాబ్ సందర్శకుల కోసం ఏఐ ఆధారిత సృజనాత్మక ప్రక్రియలను ప్రదర్శిస్తూనే ఉంటుంది.

ఏఐ ఆధారిత న్యూస్‌రూమ్:

ఏడబ్ల్యూఎస్భారత్‌జెన్ఇండియా టుడేకాలసేతు అంకురాల సహకారంతో రూపొందించిన ఈ న్యూస్‌రూమ్ సౌకర్యం.. మీడియా కార్యకలాపాలను ఏఐ ఏజెంట్లు ఏ విధంగా సులభతరం చేస్తాయో ప్రదర్శించిందిఆటోమేటెడ్ కంటెంట్ జనరేషన్ నుంచి వాయిస్ కమాండ్ ఆధారిత ఎడిటోరియల్ మేనేజ్‌మెంట్ వరకు వార్తా సంస్థల భవిష్యత్తును ఏఐ ఎలా మార్చబోతోందో ఇక్కడ వివరించారుసదస్సు ముగిసే వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రదర్శన.. రాబోయే రోజుల్లో కూడా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

నారద ముని ఇంటరాక్టివ్

పురాణాల్లోని వార్తాహరుని స్ఫూర్తితో రూపొందించిన ఈ 'ఇమ్మర్సివ్ ఇన్‌స్టాలేషన్'.. ఏఐ ఆధారిత 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్మన ప్రశ్నలను ఎలా విశ్లేషించి సహజమైన సంభాషణలుగా మారుస్తాయో ప్రదర్శించిందిఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్‌కు ఉన్న శక్తిని చాటిచెప్పే ఈ విభాగం.. సందర్శకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించిందిఈ ప్రదర్శన రాబోయే రోజుల్లో కూడా సందర్శకులను పలకరిస్తూనే ఉంటుంది.


 

ఏఐ థియేటర్:

ఇది ఒక ప్రత్యేకమైన సినిమా వేదికఇక్కడ ఎన్ఎఫ్‌డీసీఎల్‌టీఐమైండ్‌ట్రీఅడోబ్ సంస్థలు సంయుక్తంగా ఎంపిక చేసిన దాదాపు 150 ఏఐ ఆధారిత చిత్రాలను ప్రదర్శించాయిసినిమా నిర్మాణంలో కృత్రిమ మేధ తీసుకొస్తున్న కళాత్మకసాంకేతిక మార్పులను సందర్శకులు ఇక్కడ వీక్షించొచ్చుపెవిలియన్‌లో ఈ ప్రదర్శనలు రాబోయే కొద్ది రోజులు కొనసాగుతాయి.

యువర్ స్టోరీ వేదిక:

ఏఐ రంగంలోని నిపుణులుపారిశ్రామికవేత్తలతో నేడు ఇక్కడ ముఖాముఖి చర్చలు జరిగాయి. 'యువర్ స్టోరీవ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారుఆవిష్కరణలువ్యవస్థాపకతఏఐ సమ్మేళనంపై ఈ చర్చలు సాగాయిరాబోయే రోజుల్లో కూడా ఈ వేదిక మరిన్ని చర్చా కార్యక్రమాలకు వేదిక కానుంది.

ఎంఐబీ పెవిలియన్‌లోని విశేషాలు:

చలనచిత్ర నిర్మాణంబ్రాడ్‌కాస్టింగ్భాషా సాంకేతికతలువిద్యడిజిటల్ స్టోరీటెల్లింగ్ రంగాల్లో అత్యాధునిక ఏఐ అప్లికేషన్లను ప్రదర్శిస్తున్న అంతర్జాతీయభారతీయ అగ్రశ్రేణి సంస్థలు ఈ ఎంఐబీ పెవిలియన్‌లో కొలువుదీరాయి.

  • అడోబ్ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ వంటి భాగస్వామ్యాల ద్వారా ఏఐ ఆధారిత సినిమా నిర్మాణాన్ని వేగవంతం చేస్తోందిఇక్కడ ఏఐ రూపొందించిన చిత్రాలు, 'ఏఐ-ఫస్ట్క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు.

  • భారత్‌జెన్: మల్టీమోడల్ ఆర్ఏజీ సాంకేతికతను ప్రదర్శిస్తోందిదీని ద్వారా వీడియోఆడియోలలోని ఉపయోగించని సమాచారాన్ని సులభంగా వెతకగలిగే ఇంటరాక్టివ్ సమాచారంగా మార్చొచ్చు.

  • సోనీ రీసెర్చ్ ఇండియా: టీవీఓటీటీ వేదికల కోసం ఏఐ ఆధారిత అనువాదండబ్బింగ్ముఖంస్వరాన్ని వయస్సుకు అనుగుణంగా మార్చటంయాక్సెసిబిలిటీ పరిష్కారాలను ప్రదర్శిస్తోంది.

  • సర్వం: వాయిస్ క్లోనింగ్లైవ్ స్పీచ్-టు-టెక్స్ట్రియల్ టైమ్ లాంగ్వేజ్ ఏఐ సాధనాల ద్వారా బహుభాషా ఏఐ సంభాషణలను సాధ్యం చేస్తోంది.

  • అమెజాన్ వెబ్ సర్వీసెస్: 'ఏజెంటిక్ ఏఐ అసిస్టెడ్ న్యూస్‌రూమ్'ను ప్రదర్శిస్తోందిదీని ద్వారా బ్రాడ్‌కాస్ట్ ప్రొడక్షన్హైపర్-లోకల్ వార్తా పంపిణీని హస్త ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐతో నిర్వహించొచ్చు.

  • విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్: కనీస హార్డ్‌వేర్ సహాయంతో పనిచేసే 'మార్కర్-లెస్ మోషన్ క్యాప్చర్విధానాలను ప్రదర్శిస్తోంది.

  • గ్యాలరీ 5 (కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్): భారీ స్థాయి పౌరాణికథియేట్రికల్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగపడే 'ఏఐ-నేటివ్సినిమాటిక్ ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్‌లను పరిచయం చేస్తోంది.

  • కుకు ఎఫ్ఎం: భారతదేశపు మొట్టమొదటి 'ఏఐ-ఆధారిత మైక్రోడ్రామా'లను ఆవిష్కరిస్తోందిఇది సామాన్య ప్రజల డిజిటల్ కథా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

  • ప్రిస్మిక్స్కథాధారిత కంటెంట్ సృష్టి కోసం జనరేటివ్ ఏఐనివీఎఫ్‌ఎక్స్సాంప్రదాయ మీడియాతో అనుసంధానం చేస్తోంది.

  • ఇన్‌షార్ట్స్ఏఐ ఆధారిత వార్తల సారాంశాన్నియూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా వ్యక్తిగతీకరించిన వార్తా పంపిణీని ప్రదర్శిస్తోంది.

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)ఇమ్మర్సివ్ ప్రొడక్షన్ వాతావరణంలో ఏఐ ఆధారిత సృజనాత్మక విద్యను సరికొత్తగా నిర్వచిస్తోంది.

ఏఐ ఇమ్మర్సివ్ థియేటర్:

270-డిగ్రీల ప్రొజెక్షన్ఏఐ ఆధారిత సినిమాటిక్ అనుభవాలతో కూడిన ఈ వేదిక నేటి కథా గమనాన్నిప్రేక్షకుల భాగస్వామ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించిందిజాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), వేవ్స్ బజార్ఎల్‌టీఎం భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ఏఐ సినిమా ప్రదర్శన.. కథా మాధ్యమంగా ఏఐని వాడుతున్న వర్ధమాన సినీ నిర్మాతల నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చిందిఇందులో భాగంగా ఎంపిక చేసిన ఏఐ లఘు చిత్రాల సమాహారం 'కథావతార్'తో పాటు భారతదేశపు మొట్టమొదటి 'సినిమ్‌ఏఐ హ్యాకథాన్ఫైనలిస్టుల చిత్రాలను కూడా ప్రదర్శించారు.

భారత్ మండపంలోని 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'లో జరిగిన ఈ ప్రదర్శనలు.. ఏఐ ఆధారిత సినిమా ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపాయిరాబోయే రోజుల్లో కూడా ఈ ఇమ్మర్సివ్ చిత్ర ప్రదర్శనలు  కొనసాగుతాయితద్వారా అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన కథా ప్రపంచాన్ని అనుభూతి చెందే అవకాశం సందర్శకులకు ఉంటుంది.

అడోబ్ ఆధ్వర్యంలోని కంటెంట్ క్రియేషన్ ల్యాబ్:

నేటి క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా అత్యధునిక సాంకేతికతలతో కూడిన 'ఏఐ-ఆధారిత వీడియో క్రియేషన్ వర్క్‌ఫ్లో'లను ఈ ల్యాబ్ ప్రదర్శించిందిటెక్స్ట్ ప్రాంప్ట్‌లుచిత్రాలుఆడియో ఇన్‌పుట్‌లుజనరేటివ్ ఏఐ సాధనాల ద్వారా ఒక ఆలోచనను అత్యుత్తమ నాణ్యత గల వీడియోగా ఎలా మార్చొచ్చో ఇక్కడ ప్రత్యక్షంగా వివరించారు.

సందర్శకులు ఇక్కడ వీడియోఆడియోచిత్రాలకు సంబంధించిన పూర్తిస్థాయి ఏఐ వర్క్‌ఫ్లోలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారుఇందులో టెక్స్ట్-టు-వీడియోఇమేజ్-టు-వీడియో స్టోరీటెల్లింగ్జనరేటివ్ ఎడిటింగ్వేగవంతమైన కంటెంట్ మార్పులు వంటివి ముఖ్యమైనవిసంక్లిష్టమైన ప్రొడక్షన్ ప్రక్రియలను ఏఐ ఎలా సులభతరం చేస్తుందోఎడిటింగ్‌ను ఎలా ఆటోమేట్ చేస్తుందోఒక ఆలోచనను తుది అవుట్‌పుట్‌గా మార్చడంలో ఎంతటి వేగాన్ని అందిస్తుందో ఈ ప్రదర్శన చాటిచెప్పిందిమొత్తంగా  మల్టీమీడియా కంటెంట్ సృష్టిని మరింత వేగంగాస్మార్ట్‌గాభారీ స్థాయిలో చేపట్టడానికి వీలుగా ఏఐ ఒక శక్తిమంతమైన సాధనమని ఈ ల్యాబ్ నిరూపించింది.

మీడియా వేదిక:

ఈ రోజు 'యువర్ స్టోరీవ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులుమేధావులతో ముఖాముఖి చర్చలు నిర్వహించారుఈ కార్యక్రమాలన్నీ 'వేవ్స్ ఓటీటీప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యాయిదీనివల్ల సదస్సు విశేషాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయిప్రజా విధానాలుప్లాట్‌ఫాం వ్యవస్థలుసార్వభౌమ ఏఐ సామర్థ్యాలుడిజిటల్ దృఢత్వం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకోగో వంటి సంస్థలకు చెందిన నిపుణులు.. కుకు ఎఫ్ఎంగ్యారేజ్ ల్యాబ్స్ఒరాకిల్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారుఅంకుర ప్రదర్శనలువ్యవస్థాపకుల పిచ్‌లుఆరోగ్య రంగంసామాజిక సవాళ్ల పరిష్కారంలో ఏఐ పాత్ర.. ప్రాంతీయ కంటెంట్ వంటి అంశాలపై జరిగిన చర్చలు భారతదేశంలో ఆవిష్కరణల ప్రభావాన్ని చాటిచెప్పాయిరాబోయే రోజుల్లో కూడా ఈ మీడియా వేదిక మరిన్ని ముఖాముఖి కార్యక్రమాలుప్రత్యక్ష ప్రసారాల ద్వారా సదస్సు విశేషాలను అందిస్తూనే ఉంటుంది.

ప్యానెల్ చర్చలుమాస్టర్‌ తరగతులు:

భారత్ మండపంలోని పెవిలియన్ ఈ రోజు మీడియావినోద (ఎంఅండ్‌ఈరంగంలో ఏఐ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై జరిగిన పలు ప్యానెల్ చర్చలుమాస్టర్‌క్లాస్‌లకు సాక్ష్యంగా నిలిచింది. 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'లో జరిగిన ఈ చర్చలు అత్యున్నత స్థాయి విజ్ఞాన వేదికలుగా నిలిచాయిఇది పరిశ్రమ దిగ్గజాలువెంచర్ క్యాపిటలిస్టులుసాంకేతిక నిపుణులుక్రియేటర్లువిధాన నిర్ణేతలను ఒకచోట చేర్చింది

ఈ సెషన్లలో భాగంగా గేమింగ్సినిమాన్యూస్‌రూమ్ ఆటోమేషన్ఇంటరాక్టివ్ మీడియాఆదాయ నమూనాలునైతిక ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ల భవిష్యత్తుపై లోతైన చర్చలు జరిగాయిప్రముఖ చలనచిత్ర దర్శకుడు శేఖర్ కపూర్ నిర్వహించిన మాస్టర్‌ తరగతులుఅంకుర వ్యవస్థాపకుల రౌండ్‌ టేబుల్ సమావేశాలుఅంతర్జాతీయ సాంకేతిక సంస్థల 'టెక్నాలజీ డీప్-డైవ్సెషన్లు నేటి కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ సెషన్లు కేవలం సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రదర్శనలువాస్తవ ప్రపంచ ఉదాహరణలుముఖాముఖి ప్రశ్నలతో కూడిన ప్రశ్నలుసమాధానాల ప్రాతిపదికన సాగాయిఏఐ-ఆధారిత మీడియా తక్షణ వినియోగంపెట్టుబడి అవకాశాలుమీడియా వినోద రంగంపై ఇది చూపే దీర్ఘకాలిక ప్రభావంపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్పష్టమైన అవగాహనను పొందారు

మీడియా రంగంలో ఏఐ పోషిస్తున్న విప్లవాత్మక పాత్రపై మరింత లోతైన అవగాహన కల్పిస్తూ 'వేవ్స్పెవిలియన్‌లో ఈ ప్యానెల్ చర్చలుమాస్టర్‌ తరగతులు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2229565) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada