సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్ పర్వ్ వేదికగా భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా ప్రదర్శిస్తున్న వేవ్స్ బజార్
వ్యూహాత్మక చలనచిత్ర పర్యాటక ప్రణాళికలను ఆవిష్కరించిన మహారాష్ట్ర, ఢిల్లీ
ఓపెన్ పిచ్ సమావేశాలు, గ్లోబల్ ప్యానెల్ చర్చల ద్వారా ఫిల్మ్ మేకర్స్, టెక్ స్టార్టప్‌లను
శక్తిమంతం చేయడంలో ఎన్ఎఫ్‌డీసీ, వేవ్స్ తోడ్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 4:24PM by PIB Hyderabad
రిట్జ్‌లో జరిగిన భారత్ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన వేవ్స్ బజార్... ప్రపంచ సినిమా నిపుణులు, సాంకేతిక ఆవిష్కర్తలు, విధాన రూపకర్తల కీలక సమావేశానికి వేదికగా నిలిచింది. వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కార్యక్రమం కింద నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం... సినిమా, మీడియా, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక సాంకేతికతల్లో విస్తరిస్తున్న భారత్ ప్రభావాన్ని స్పష్టం చేస్తూనే "గ్లోబల్ కంటెంట్ ఫ్యాక్టరీ"గా పెరుగుతున్న భారత్ స్థాయినీ చాటి చెప్పింది.
గ్లోబల్ కంటెంట్ ఫ్యాక్టరీగా భారత్
భారత ఏవీజీసీ, చలనచిత్ర రంగాలకు "ముందుకు సాగే మార్గం" గురించి ఎన్ఎఫ్‌డీసీ జీఎమ్ శ్రీ గౌతమ్ భానోత్ ప్రారంభ వ్యాఖ్యలతో ఈ నాటి కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్ఎఫ్‌డీసీ మీడియా, కమ్యూనికేషన్ జనరల్ మేనేజర్ విదుషి కైన్ మోడరేట్ చేసిన "ఇండియా యాజ్ ఎ గ్లోబల్ కంటెంట్ ఫ్యాక్టరీ: స్కేల్, టాలెంట్, న్యూ బిజినెస్ మోడల్స్" అనే ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ, అంతర్జాతీయ కథలను నడిపించడంలో పెరుగుతున్న బారత్ సామర్థ్యాన్ని అన్వేషించింది. మార్టెన్ రాబర్ట్స్ (ఐఎఫ్ఎఫ్ఆర్ ప్రో), కాథరినా సక్కేల్ (బాంబే బెర్లిన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్), టామాసో ప్రియాంటే (లుమినాలియా)లతో కూడిన ఈ చర్చ... ఫిల్మ్ బజార్, వేవ్స్ బజార్ వంటి వేదికలతో పాటు వేవ్ఎక్స్, సీఐసీ ఛాలెంజ్ వంటి ప్రభుత్వ-మద్దతు గల కార్యక్రమాలు భారత చిత్ర నిర్మాణ స్థాయిని ఎలా బలోపేతం చేస్తున్నాయి, ప్రతిభను ఎలా పెంపొందించుకుంటున్నాయి, సరిహద్దు సహకారాలను ప్రారంభించడం ద్వారా సృజనాత్మక రంగాలు, ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి పోటీ కేంద్రంగా దేశాన్ని ఎలా నిలుపుతున్నాయో స్పష్టం చేసింది.
మంత్రివర్గ ప్రజెంటేషన్స్: ఢిల్లీ, మహారాష్ట్ర
ప్రాంతీయ చలనచిత్ర పర్యాటకానికి గణనీయ ప్రోత్సాహకంగా ఢిల్లీ, మహారాష్ట్రలు తమ వ్యూహాత్మక అజెండాలను ప్రదర్శించాయి. పర్యాటకం, కళలు, సాంస్కృతిక శాఖల మంత్రి (ఢిల్లీ) శ్రీ కపిల్ మిశ్రా, ఢిల్లీ పర్యాటక రంగ కోసం ప్రజెంటేషన్‌కు నాయకత్వం వహించారు. చలనచిత్ర నిర్మాతల కోసం రాజధాని పునరుద్ధరించిన విధానాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమ అనంతరం సాంస్కృతిక శాఖ మంత్రి (మహారాష్ట్ర) శ్రీ ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ఫిల్మ్ సిటీపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. స్థానిక, అంతర్జాతీయ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర నిర్మాణ మద్దతును, ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడానికి రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న సహకారం కోసం ఇరువురు మంత్రులను సత్కరించారు.
ప్రపంచస్థాయి సహ-నిర్మాణాలపై ప్రధానంగా దృష్టి: కురింజి ప్రాజెక్ట్
ఫిబ్రవరి 13న జరిగిన భారత్ పర్వ్‌లో యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్‌లోని వేవ్స్ బజార్ గ్లోబల్ ఔట్‌రీచ్ ప్రతినిధుల బృందం తమ ఇండియా-ఫ్రాన్స్-జర్మనీ సహ-నిర్మాణ నమూనాపై ప్యానెల్ చర్చ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన కురింజిని ఫీచర్‌ను ప్రదర్శించింది. ఈ సమావేశంలో రచయిత-దర్శకురాలు పాయల్ సేథి, ఆమె అంతర్జాతీయ నిర్మాణ భాగస్వాములు పాల్గొన్నారు.
ఎన్ఎఫ్‌డీసీ వేవ్స్ ఫిల్మ్ బజార్ సహ-నిర్మాణ మార్కెట్‌లో బెర్లినేల్ టాలెంట్స్ ఫెలోషిప్, మొదటి బహుమతి సాధించిన కురింజి అనేది వలస, గుర్తింపు, సమర్థతను అన్వేషించే ఒక పాత్ర-ఆధారిత నాటకం... దీనిని కేరళలో రూపొందించారు. అంతర్జాతీయ ఎమ్మీ-విజేత సిరీస్ ఢిల్లీ క్రైమ్ ద్వారా పేరుగాంచిన ఫిల్మ్‌కారవాన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ బలమైన సరిహద్దు సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సముచిత రీతిలో కథలను చెప్పడంలో పెరుగుతున్న భారత్ ఉనికిని ఇది స్పష్టం చేసింది.
కొత్త ప్రతిభకు సాధికారత: ఓపెన్ పిచ్‌లు, సీఐసీ
"ఫిల్మ్ మేకర్స్, టెక్ స్టార్టప్స్ ఓపెన్ పిచ్" అనే ప్రత్యేక విభాగంలో విభిన్న శైలులు, ప్రాంతాలను కవర్ చేస్తూ తొమ్మిది ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిలో సహ-నిర్మాణ భాగస్వాములను ఆశిస్తున్న హిందీ-జపనీస్ మిస్టరీ డ్రామా కబూతర్... వలసలను అన్వేషించే ఆర్ట్-హౌస్ డ్రామా యే మేరా ఘర్ (మై హోమ్)... తమిళ-ఇంగ్లీష్ యానిమేటెడ్ పిల్లల ఫీచర్, ఫైనాన్సింగ్‌లో ఎక్స్ఆర్ ప్రాజెక్ట్ అయిన THE G.O.A.T. ఉన్నాయి.
ఫిబ్రవరి 13న భారత్ పర్వ్‌లో ప్రదర్శించిన ఇతర ప్రాజెక్టుల్లో అవార్డు గెలుచుకున్న హిమాలయన్ డ్రామా ఎకోస్ ఆఫ్ ది హెర్డ్... 1980ల నాటి యూకే-సెట్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ వైట్ గై... కొంకణి-హిందీ ఫాంటసీ రొమాన్స్ మిస్టర్ ఫ్రాన్సిస్ అండ్ ది లాస్ట్ స్టాండింగ్ పీసీవో... బెర్లిన్-ఇండియా డ్రామా కాన్హి డోర్ (స్టిల్… సమ్‌వేర్)... నాగాలాండ్ నుంచి టెన్నిడీ కమింగ్-ఆఫ్-ఏజ్ కథ అడే (ఆన్ ఎ వీకెండ్)... జైలులో సాగే హిందీ డ్రామా ICE-PICE ఉన్నాయి.
క్రూబెల్లా వికేంద్రీకృత ఫెస్టివల్ మోనిటైజేషన్ ప్లాట్‌ఫామ్, టూటీఫ్రూటీ గేమ్స్ ఏఐ-ఆధారిత పౌరాణిక గేమింగ్ ఐపీ, జాంగో జనరేటివ్ ఏఐ లోకలైజేషన్ సాధనాలు, ఫోక్లాగ్ యానిమేషన్-నేతృత్వంలోని జానపద వారసత్వ వేదికను కలిగిన వేవ్ ఎక్స్ ప్రదర్శన ద్వారా ఆవిష్కరణలను మరింత హైలైట్ చేశారు.
రాజారామ్ తప్పించుకోవడం గురించిన చారిత్రక యానిమేటెడ్ ఫీచర్ రోడ్ టు జింజి, అధునాతన అభివృద్ధిలో భారీ స్థాయి యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ది డ్రీమ్ బెలూన్‌లతో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) విజేతలు ఆసక్తిని మరింత పెంచారు.
భారత్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య అంతర్జాతీయ సహ-నిర్మాణం కురింజి ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ప్యానెల్ చర్చతో మధ్యాహ్న సమావేశం ముగిసింది. ఆ తర్వాత ప్రపంచ భాగస్వామ్యాలను పెంపొందించడానికి భారత ప్రతినిధి బృందం పాల్గొన్న ఇంటెన్సివ్ బీ2బీ సమావేశాలు జరిగాయి.
***
(రిలీజ్ ఐడి: 2228471)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5