ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు గల జాతీయ రహదారి-167ని ప్రామాణిక 4 వరుసల రహదారిగా విస్తరించడానికి కేబినెట్ ఆమోదం
ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 80.01 కిలోమీటర్లు
మొత్తం మూలధన వ్యయం రూ.3175.08 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 1:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న జాతీయ రహదారి-167ని ప్రామాణిక 4 వరుసల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం 80.01 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఎన్‌హెచ్ (ఓ) పథకం కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానంలో రూ.3175.08 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ప్రస్తుతం జాతీయ రహదారి-167లోని గుడేబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ మధ్య చాలా పేలవమైన నిర్మాణం, పట్టణ ప్రాంతంలో అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణ సమయం గణనీయంగా పెరుగుతోంది. ఈ మార్గం గుడేబెల్లూర్, మాగ్నూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లయిర్, యెలిగండ్ల, బందర్‌పల్లి వంటి బాగా అబివృద్ధి చెందిన పట్టణాలు, గ్రామాల మీదుగా వెళుతుంది. ఈ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును 4 వరుసల ప్రామాణిక రహదారిగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు గణనీయ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2228191)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30