సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చలనచిత్రాల ధ్రువీకరణ కు 48 రోజుల వెసులుబాటు ఉండగా సగటున 18 రోజులకు తగ్గుదల

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 4:23PM by PIB Hyderabad

సినిమాటోగ్రాఫ్ చట్టం-1952సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణ) నియమావళి-2024లలో నిర్దేశించిన ప్రకారం చలనచిత్రాల ధ్రువీకరణ కేంద్ర మండలి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్..సీబీఎఫ్‌సీ) పనిచేస్తోంది. పైన ప్రస్తావించిన నియమావళిలోని రూల్ 37లో, చలనచిత్రాల ధ్రువీకరణకు నిర్దేశించిన కాల పరిమితి 48 పని దినాలుగా ఉంది. ధ్రువీకరణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసే వ్యవస్థను అమల్లోకి తీసుకు రావడంతోప్రస్తుతం చలనచిత్రాల ధ్రువీకరణకు తీసుకుంటున్న సగటు కాలం 18 పని దినాలుగా ఉండగా లఘు చిత్రాల (షార్ట్ ఫిలింస్) విషయంలో ఇది 3 పని దినాలుగా ఉంది.

థియేటర్లలో విడుదలకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరించిన చలనచిత్రాల సంవత్సరం వారీ వివరాలుఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్‌సీఏటీ)ను 2021లో రద్దు చేసిన తరువాత నుంచి రివైజింగ్ కమిటీ (ఆర్‌సీ)తో పాటు వేర్వేరు ఉన్నత న్యాయస్థానాల వద్ద సవాలు చేసిన నిర్ణయాల వివరాలూ ఈ కింది పట్టికలో పేర్కొనడమైంది: 

సంవత్సరం

2021-22

2022-23

2023-24

2024-25

2025-26 లో ఇప్పటి వరకూ

సర్టిఫై చేసిన మొత్తం చలనచిత్రాలు

2031

2777

2837

2687

2248

ఆర్‌సీ వద్ద సవాలు చేసినవి

25

46

49

38

55

హెచ్‌సీ వద్ద సవాలు చేసినవి

2

4

1

4

10

 

చలనచిత్రాలపై నిర్ణయం తీసుకోవడానికి రివైజింగ్ కమిటీ తీసుకొనే కాలం.. సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణ) నియమావళి-2024 లోని రూల్  37(7) లో భాగంగా నిర్దేశించిన కాలావధి పరిధికి లోబడి ఉంది.

ప్రస్తుతం సినిమాటోగ్రాఫ్ చట్టం-1952సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణ) నియమావళి-2024 ఫిర్యాదుల పరిష్కారానికి బహుళ స్థాయుల యంత్రాంగానికి వీలును కల్పిస్తున్నాయి. దీంతోదరఖాస్తుదారులు ఒక రివైజింగ్ కమిటీకి అపీలు చేసుకొనే అవకాశం లభిస్తోంది.

ఈ మేరకు శ్రీమతి ప్రియాంకా గాంధీ వాద్రా అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచారప్రసార శాఖపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో సమాధానమిచ్చారు.


(రిలీజ్ ఐడి: 2223256) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil , Kannada , Malayalam