ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటీ, ఏవీజీసీ, ఆతిథ్య రంగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ అందించనున్న 'దివ్యాంగ్ కౌశల్ యోజన'


దివ్యాంగుల కోసం ఆధునిక రిటైల్ తరహా కేంద్రాలుగా 'అసిస్టివ్ టెక్నాలజీ మార్ట్‌'లను ఏర్పాటు చేయనున్న 'దివ్యాంగ్ సహారా యోజన'

प्रविष्टि तिथि: 01 FEB 2026 12:41PM by PIB Hyderabad

అర్థవంతమైన భాగస్వామ్యం కోసం ప్రతి కుటుంబం, వర్గం, ప్రాంతం, రంగానికి వనరులు, సౌకర్యాలు, అవకాశాలు అందుబాటులో ఉండేలా చూడటమే 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' దార్శనికత అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు:

దివ్యాంగ్ కౌశల్ యోజన: ఐటీ, ఏవీజీసీ రంగాలు, ఆతిథ్యం- ఆహార పానీయాల రంగాలు పని- ఆధారిత, ప్రక్రియ-ఆధారిత ఉపాధిని అందిస్తాయి. ఇవి దివ్యాంగులకు చాలా అనువైనవి. ప్రతి దివ్యాంగ వర్గానికి ప్రత్యేకమైన, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన శిక్షణ ద్వారా ఈ పథకం గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలు అందేలా చూసుకుంటుంది. 

దివ్యాంగ్ సహారా యోజన: అర్హులైన దివ్యాంగులందరికీ నాణ్యమైన సహాయక పరికరాలు సకాలంలో అందడం అనేది ప్రాథమిక అవసరం. బడ్జెట్.. (i) సహాయక పరికరాల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన - అభివృద్ధి, ఏఐ అనుసంధానంపై పెట్టుబడులు చేసేందుకు భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థకు (ఏఎల్‌ఐఎంసీఓ) మద్దతు ఇవ్వడం (ii) పీఎం దివ్యాశ కేంద్రాలను బలోపేతం చేయడం.. దివ్యాంగులు - వృద్ధులు సహాయక ఉత్పత్తులను చూసి, పరీక్షించి, కొనుగోలు చేసుకునేందుకు వీలు ఉండే ఆధునిక రిటైల్ తరహా కేంద్రాలుగా 'అసిస్టివ్ టెక్నాలజీ మార్ట్‌'ల ఏర్పాటుకు మద్దతనివ్వాలని ప్రతిపాదిస్తోంది. 

 

***


(रिलीज़ आईडी: 2221646) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam