ఆర్థిక మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా భారత్ భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దేందుకు ‘బ్యాంకింగ్ ఉన్నత స్థాయి కమిటీ’ ఏర్పాటు: కేంద్ర బడ్జెట్ 2026-27
సంస్థల సామర్థ్యాన్ని పెంచటానికి, నాణ్యమైన పనితీరుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌లను పునః వ్యవస్థీకరించనున్న ప్రభుత్వం
కార్పొరేట్ బాండ్ సూచీల్లో తగినంత నిధుల లభ్యత, డెరివేటివ్స్ సౌకర్యంతో మార్కెట్ మేకింగ్ వ్యవస్థను ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్
అధిక విలువ గల మున్సిపల్ బాండ్ల జారీని ప్రోత్సహించేందుకు రూ.1000 కోట్లకు మించిన ఒక బాండ్ జారీపై రూ.100 కోట్ల ప్రోత్సాహకం
పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ద్వారా లిస్టెడ్ ఇండియన్ కంపెనీల ఈక్విటీల్లో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు అనుమతి
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 12:45PM by PIB Hyderabad
వికసిత్ భారత్‌లో భాగంగా బ్యాంకింగ్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రతిపాదించింది. ఇది ఆర్థిక రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, దేశ భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా మార్పులు చేస్తుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల భద్రతను కాపాడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. భారత బ్యాంకింగ్ రంగం పటిష్టమైన బ్యాలెన్స్ షీట్లు, రికార్డు స్థాయి లాభాలు, నాణ్యమైన ఆస్తులతో ఉందని, దేశంలోని 98% గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించాయని కేంద్ర బడ్జెట్ పేర్కొంది.
ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పెంచేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లను పునః వ్యవస్థీకరించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. టెక్నాలజీ వినియోగం, రుణ పంపిణీకి సంబంధించి స్పష్టమైన లక్ష్యాలతో వికసిత్ భారత్ దార్శనికతో రూపొందించారు.
మారుతున్న ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా వినియోగదారులకు సౌకర్యంగా ఉండే వ్యవస్థను రూపొందించేందుకు, విదేశీ పెట్టుబడులను మరింత సరళతరం చేసేందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ (రుణ రహిత సాధనాలు) నిబంధనలను సమగ్రంగా సమీక్షించాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
కార్పొరేట్ బాండ్ సూచీల్లో డెరివేటివ్స్, నిధుల లభ్యత కోసం మార్కెట్ మేకింగ్ వ్యవస్థను, కార్పొరేట్ బాండ్లపై టోటల్ రిటర్న్ స్వాప్స్‌ను కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రతిపాదించింది.
పెద్ద నగరాలు అధిక విలువగల మున్సిపల్ బాండ్లను జారీ చేసేలా ప్రోత్సహించటానికి రూ. 1000 కోట్లకు పైబడిన ఒకే బాండ్ జారీపై రూ. 100 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. చిన్న, మధ్యతరహా పట్టణాల కోసం అమృత్ పథకం ద్వారా రూ.200 కోట్ల వరకు బాండ్ల జారీని ప్రోత్సహించే పథకం కొనసాగుతుంది.
సులభతర వాణిజ్య ప్రోత్సాహకానికి, పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ద్వారా లిస్టెడ్ ఇండియన్ కంపెనీల ఈక్విటీల్లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (పీఆర్ఓఐ) పెట్టుబడి పెట్టేందుకు అనుమతిచ్చారు. ఈ స్కీమ్ ద్వారా వ్యక్తిగత పెట్టుబడి పరిమితిని 5% నుంచి 10%కి, పీఆర్ఓఐ కలిపి గరిష్ఠ పెట్టుబడి పరిమితిని 10% నుంచి 24%కి పెంచాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.
***
(రిలీజ్ ఐడి: 2221507)
సందర్శకుల సూచీ సంఖ్య : : 94
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam