ప్రధాన మంత్రి కార్యాలయం
సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా, ఫిబ్రవరి 1న పంజాబ్‌లో పర్యటించనున్న పీఎం
పూజ్యనీయ సాధువు, సంఘ సంస్కర్త పట్ల గౌరవార్థంగా ఆదంపూర్ విమానాశ్రయం పేరును 'శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్‌పోర్టు, ఆదంపూర్'గా మార్పు
లుథియానాలోని హల్వారా ఎయిర్‌పోర్టులో టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న పీఎం
प्रविष्टि तिथि:
31 JAN 2026 10:48AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1, 2026న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆదంపూర్ విమానాశ్రయాన్ని సందర్శించి, 'శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్‌పోర్టు, ఆదంపూర్'గా కొత్త పేరును ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. లుథియానాలోని హల్వారా ఎయిర్‌పోర్టులో టెర్మినల్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.
సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా ఆదంపూర్ విమానాశ్రయం పేరును మార్చడం ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవం. సమానత్వం, కరుణ, వ్యక్తిత్వ గౌరవం పరంగా ఆయన చేసిన బోధనలు భారతదేశ సామాజిక విలువలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
పంజాబ్‌లో విమానయాన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ, హల్వారా విమానాశ్రయంలో ప్రధానమంత్రి ప్రారంభించనున్న టెర్మినల్ భవనం రాష్ట్రానికి నూతన ద్వారంగా నిలవనుంది. ఇది లుథియానాతో పాటు పరిసర పారిశ్రామిక, వ్యవసాయ అనుబంధ ప్రాంతాల అవసరాలను తీరుస్తుంది. లుథియానాలోని హల్వారా భారత వైమానిక దళ స్థావరానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ప్రాంతం.
లుథియానాలోని పాత విమానాశ్రయం రన్‌వే చిన్నదిగా ఉండటంతో చిన్న విమానాలకు మాత్రమే అనుకూలంగా ఉండేది. ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, పెద్ద విమానాల రాకపోకలకు వీలుగా హల్వారాలో పొడవైన రన్‌వేతో అభివృద్ధి చేసిన నూతన సివిల్ ఎన్‌క్లేవ్, ఏ320 వంటి పెద్ద విమానాలను తట్టుకోగల సామర్థ్యం గలది.
ప్రధానమంత్రి ఆకాంక్షించిన సుస్థిర, పర్యావరణ అనుకూల అభివృద్ధికి అనుగుణంగా, ఈ టెర్మినల్‌ను పర్యావరణహితమైన అంశాలతో అభివృద్ధి చేశారు. విద్యుత్ పొదుపు చేసేలా ఎల్‌ఈడీ లైటింగ్, ఇన్సులేటెడ్ రూఫింగ్, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, మురుగునీటి, నీటి శుద్ధి ప్లాంట్లు నెలకొల్పారు. రీసైకిల్ చేసిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్మాణ శైలి పంజాబ్ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రయాణికులకు ఆ ప్రాంత వైవిధ్యభరిత అనుభూతిని కలిగిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2221300)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam