ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 28 JAN 2026 6:37PM by PIB Hyderabad

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రిరక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌జీవేదికపై ఉన్న అతిథులుదేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీఎన్ఎస్ఎస్ క్యాడెట్లుశకటాల కళాకారులురాష్ట్రీయ రంగశాల ఉద్యోగులునా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోందిమంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.

స్నేహితులారా,

ఈ రోజు మనకు తీవ్ర దుఖ్ఖాన్ని తీసుకొచ్చిందిమహారాష్ట్రలో ఈ ఉదయం జరిగిన విమాన ప్రమాదం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌నుఇతరులను మనకు దూరం చేసిందిమహారాష్ట్రదేశ అభివృద్ధికి అజిత్ దాదా విశేష కృషి చేశారుముఖ్యంగా గ్రామాల్లో జీవనాన్ని మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేసేవారుఅజిత్ పవార్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నానుఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం.

స్నేహితులారా,

ఇక్కడ ఉన్న క్యాడెట్లుమిత్ర దేశాల నుంచి వచ్చిన క్యాడెట్లుఅధికారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈసారి పెద్ద సంఖ్యలో బాలికా క్యాడెట్లు వచ్చారువారికి ప్రత్యేక అభినందనలు.

స్నేహితులారా,

భారత యువశక్తిలో ఆత్మవిశ్వాసం నింపేక్రమశిక్షణ అలవాటు చేసేధైర్యాన్ని నింపేదేశానికి అంకితమయ్యే పౌరులుగా మార్చే సంస్థ ఎన్‌సీసీప్రతి ఏడాది మీరు పోషిస్తున్న పాత్రను బలోపేతం చేసుకుంటున్నారుగడచిన కొన్నేళ్లలో ఎన్‌సీసీ క్యాడెట్ల సంఖ్య 14 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిందిముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలుతీర ప్రాంతాల్లో ఎన్‌సీసీ క్యాడెట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నా యువ మిత్రులారా,

యువతకు ఎన్‌సీసీ ఒక వేదికఈ వేదికపై తమ వారసత్వాన్నిగర్వాన్ని వ్యక్తం చేయగలుగుతారుఉదాహరణకుఈ ఏడాది వందేమాతరం 150 వసంతోత్సవాలను ఎన్‌సీసీ ఉత్సాహంగా నిర్వహిస్తోందిదేశంలో ప్రతి మూల దీనికి సంబంధించిన కార్యక్రమాలను మీరు నిర్వహించారుపరమ వీర్ సాగర్ యాత్ర దీనికి గొప్ప ఉదాహరణకొన్నేళ్ల కిందట 21 అండమాన్ నికోబార్ దీవులకు పరమ వీర చక్ర విజేతల పేర్లను మా ప్రభుత్వం పెట్టిందని మీ అందరికీ తెలుసుమీ సాహస నౌకా యాత్ర ద్వారా జాతీయ వీరులను గౌరవించే బాధ్యతను మీరు ముందుకు తీసుకెళ్లారుఅదే విధంగా మహాసముద్రంసంస్కృతిప్రకృతి వేడుకను ఐలాండ్ ఉత్సవాల రూపంలో లక్షద్వీప్‌లో నిర్వహించారు.

స్నేహితులారా,

స్మారక చిహ్నాల నుంచి చరిత్రను బయటకు తీసుకువచ్చి.. ప్రజల జీవితాల్లో వాటిని సజీవంగా ఎన్‌సీసీ ఉంచుతోందిబాజీరావు పీష్వా పరాక్రమం గొప్ప యోధుడైన లచిత్ బోర్ఫుకన్ నైపుణ్యంభగవాన్ బిర్సా ముండా నాయకత్వం గురించి సైకిల్ ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారుఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టిన మీ అందరినీ అభినందిస్తున్నానుఈ రోజు పురస్కారాలు స్వీకరించిన అందరికీ శుభాకాంక్షలు.

స్నేహితులారా,

దేశానికి ఇదే సరైన సమయమని నేను ఎర్రకోట నుంచి చెప్పానుఇది మన దేశ యువతకు గరిష్ట అవకాశాలు లభించే సమయందీని నుంచి యువత వీలైనంత ప్రయోజనం పొందేలా మా ప్రభుత్వం కృషి చేస్తోందిదీనికి ఉదాహరణను మీరు నిన్ననే చూశారుభారత్యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందిదీని కంటే ముందు ఒమన్న్యూజిలాండ్బ్రిటన్యూఏఈఆస్ట్రేలియామారిషస్‌లతో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయిఇవన్నీ లక్షలాది మంది యువతకు లెక్కలేనన్ని అవకాశాలను కల్పిస్తాయి.

స్నేహితులారా,

ఇప్పుడు ప్రపంచమంతా భారతీయ యువత వైపు గొప్ప నమ్మకంతో చూస్తోందిదీనికి కారణం.. నైపుణ్యాలువిలువలేప్రజాస్వామ్య విలువలు భారతీయ యువతలో ఉన్నాయిభిన్నత్వాన్ని గౌరవించే విలువలను మన యువతకు ఉన్నాయిఈ మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించే విలువలు కూడా భారతీయ యువతలో ఉన్నాయికాబట్టి.. మన యువత ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి ప్రజలతో ఇట్టే కలిసిపోగలుగుతారువారి హృదయాలను గెలుచుకోగలుగుతారుమన సామర్థ్యంతో ఆ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాంఇవే మన విలువలుఇదే మన నైజంపని ప్రదేశం (కర్మభూమిపట్లమాతృభూమి పట్ల అమితమైన గౌరవంఅసమానమైన అంకితభావంఇదే మన వారసత్వం.

స్నేహితులారా,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో నేను మాట్లాడినప్పుడుఆ సంభాషణ ఆధారంగా నేను ఓ విషయాన్ని కచ్చితంగా చెప్పగలనునిపుణులైన మన భారతీయ యువత కష్టపడి పని చేస్తారుఅందుకే వారికి గొప్ప డిమాండ్ ఉందిఉదాహరణకుగల్ఫ్ దేశాల్లో చూడండిఅక్కడ లక్షలాది మంది ప్రజలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారుచాలా దేశాల్లో అద్భుతమైన వైద్య వ్యవస్థలనుమౌలిక సదుపాయాలను మన వైద్యులుఇంజినీర్లు ఏర్పాటు చేస్తున్నారుఎన్నో దేశాల్లోని సమాజాలకు కొత్త విలువలను మన ఉపాధ్యాయులు జోడించారు.

స్నేహితులారా,

వారు అందిస్తున్న సహకారాన్నిదేశ యువత సాధిస్తున్న విజయాలను ఈ ప్రపంచమంతా ప్రశంసిస్తోందిఎందుకంటే.. ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ వెన్నెముకగా మారిందిఇప్పుడుఅంకుర సంస్థలుఅంతరిక్షండిజిటల్ టెక్నాలజీతో సహా ప్రతి రంగంలోనూ ఈ యువ శక్తి నూతన విప్లవానికి నాంది పలుకుతోంది.

స్నేహితులారా,

యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఒప్పందాన్ని ఇప్పుడు ‘‘మదర్ ఆఫ్ డీల్స్’’గాగేమ్-ఛేంజర్‌గా ఈ ప్రపంచం కొనియాడుతోందిమీ ఆకాంక్షలకు స్వేచ్ఛను ఈ ఎఫ్‌టీఏ అందిస్తుందిప్రపంచ జీడీపీలో నాలుగో వంతునుఅంతర్జాతీయ వాణిజ్యంలో మూడో వంతును ఈ ఒప్పందం సూచిస్తుంది.

స్నేహితులారా,

యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం అంటే ప్రపంచంలోని 27 దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందని అర్థంఇది భారతీయ అంకుర సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందిభారత అంకుర సంస్థలకు పెట్టుబడులుఆవిష్కరణల వ్యవస్థను సులభతరం చేస్తోందిఈ ఒప్పందంతో చలనచిత్రాలుగేమింగ్ఫ్యాషన్డిజిటల్ కంటెంట్సంగీతండిజైన్ లాంటి మన సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో ప్రయోజనం లభిస్తుందిదీనితో పాటుగా.. భారత దేశ పరిశోధనవిద్యా రంగాల్లో ఐటీఇతర నైపుణ్య సేవలకు అనేక నూతన అవకాశాలు కూడా లభిస్తాయి.

స్నేహితులారా,

సమగ్రంగాలోతుగాకొత్త శిఖరాలను అధిరోహించేలాఅనేక ప్రయోజనాలు అందించేలా ఉండటం వల్లే ఈ ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’ అని పిలుస్తున్నారుఇది ఆత్మనిర్భర భారత్ కార్యక్రమానికి వేగాన్ని అందిస్తుందిఅలాగే మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్ సంకల్పానికి బలాన్నిస్తుందిఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా దాదాపు 99 శాతం భారతీయ ఎగుమతులపై సున్నా సుంకం లేదా చాలా తక్కువ పన్ను ఉంటుందిదీని నుంచి జౌళితోలురత్నాలుఆభరణాలుపాదరక్షలుఇంజినీరింగ్ వస్తువులుఎంఎస్ఎంఈలు వంటి మన భారతీయ పరిశ్రమలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుంది. 27 యూరోపియన్ దేశాల మార్కెట్లకు మన చేనేత కార్మికులుచేతివృత్తుల వారుచిన్న పారిశ్రామికవేత్తలు నేరుగా చేరుకోగలుగుతారు.

స్నేహితులారా,

ఈ ఒప్పందంలో బలమైన మరో కోణం కూడా ఉందిఎన్నో పెట్టుబడులు భారతదేశానికి రానున్నాయిదేశంలో నూతనంగా ఇంజినీరింగ్ఎలక్ట్రానిక్స్రసాయనఫార్మాతదితర తయారీ ప్లాంట్లు ప్రారంభమవుతాయిఅలాగేవ్యవసాయంఆహార శుద్ధిమత్స్య రంగంలో కొత్త పెట్టుబడులకు హామీ ఇచ్చే మార్కెట్టును ఏర్పాటు చేస్తుందిఇది రైతులకుమత్స్యకారులకుగ్రామీణ యువతకు గొప్ప అవకాశం.

నా యువ మిత్రులారా,

ఐరోపాలోని ఉద్యోగ మార్కెట్టుకు భారతీయ యువతను ఈ ఎఫ్‌టీఏ నేరుగా అనుసంధానిస్తుందిముఖ్యంగా ఇంజినీరింగ్గ్రీన్ టెక్డిజైన్లాజిస్టిక్స్అధునాతన తయారీ రంగాల్లో అనేక అవకాశాల సృష్టి జరుగుతుందిఅంటే భారత యువతకు 27 దేశాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని అర్థం.

స్నేహితులారా,

సమగ్ర సంస్కరణల ద్వారా అంతర్జాతీయ అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తరిస్తోందియువశక్తికి ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని.. ఈ సంస్కరణలు తొలగిస్తున్నాయిదేశం ముందు ఉన్న పెరుగుతున్న ఈ అవకాశాలుఎన్‌‌సీసీ యువతలో ఉన్న విలువలుక్రమశిక్షణ కలిస్తే బంగారానికి తావి అబ్బినట్టు ఉంటుంది.

స్నేహితులారా,

ఆపరేషన్ సిందూర్‌పై అద్భుతమైన శకటాన్ని మీరు ప్రదర్శించారుఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నానుజాతీయ భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ఆ సమయంలో మన ఎన్‌సీసీ క్యాడెట్లు వారి బాధ్యతలను గొప్పగా నిర్వర్తించారుకొందరు మన సైనిక సన్నాహానికి తోడ్పాటు అందించారుకొందరు రక్తదాన శిబిరాలు నిర్వహించారుమరికొందరు ప్రథమ చికిత్స శిబిరాల్లో పనిచేశారుకవాతు శిక్షణతో పాటు.. దేశమే ప్రధానం అనే ఆలోచనా ప్రక్రియలో కూడా ఎన్‌సీసీలో శిక్షణ ఉంటుందని మీరు చూపించారుఎన్‌‌సీసీ బోధించిన దేశభక్తినాయకత్వమే క్లిష్ట సమయాల్లో దేశం కోసం మొత్తం శక్తితో పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందినేను ఎన్‌సీసీలో ఉన్నప్పుడు, ‘‘దేశమే ప్రధానం’’ అనే భావన ఇలాగే బలోపేతమైందిఇప్పుడు అదే ఎన్‌సీసీలో మీరంతా నేర్చుకోవడం చూసి గర్వపడుతున్నాను.

స్నేహితులారా,

భారత దేశ సామర్థ్యాన్నిమన సైనిక పరాక్రమాన్ని ఆపరేషన్ సిందూర్ మరోసారి చాటిచెప్పిందిదేశీయంగా తయారు చేసిన మన ఆయుధాలు ఎంత అధునాతనంగాఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ తెలియజేసింది.

స్నేహితులారా,

ప్రస్తుత ఆధునిక యుద్ధ కాలంలో యువత నైపుణ్యాల పాత్ర బాగా పెరిగిందిఇప్పుడు సరిహద్దుల్లో ట్యాంకులుగన్నులుఫిరంగులకే యుద్ధం పరిమితం కాలేదుఅనేక రూపాల్లో ఇప్పుడు యుద్ధం జరుగుతోందికోడ్క్లౌడ్ రూపంలోనూ యుద్ధం జరుగుతోందిసాంకేతికంగా వెనకబడిన దేశాలు ఆర్థికంగానే కాకుండా భద్రతాపరంగానూ బలహీనంగా ఉంటాయి.

కాబట్టి స్నేహితులారా,

యువతగా.. ఈ దేశానికి మనం ఎలాంటి నూతన సాంకేతికతను అందించగలమనే ఆసక్తి దేశభక్తిని బలోపేతం చేస్తుందిదేశ భద్రతకు గొప్ప సహకారాన్ని అందిస్తుందిమీ అందరికీ తెలుసుసాంకేతికత ద్వారా ఆవిష్కరణాత్మక ఆలోచనలున్న యువతకు సైన్యంలో కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతోందని మీ అందరికీ తెలుసునేడు మన యువత నిర్వహిస్తున్న రక్షణ అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయిమేడ్ ఇన్ ఇండియా డ్రోన్లపై పని కొనసాగుతోందిమన సైనిక దళాలను ఏఐరక్షణ ఆవిష్కరణలు ఆధునికంగా మారుస్తున్నాయిఅంటే.. మీకు అవకాశాలు పెరుగుతున్నాయిఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత దీని నుంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను.

స్నేహితులారా,

మూడు రోజుల క్రితమే జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకున్నాంఆ రోజు నేను దేశ ప్రజలకు ఓ లేఖ రాశానుదేశంలోని ప్రతి పౌరునికీ మన రాజ్యాంగం అందించిన హక్కుబాధ్యతకు సంబంధించిన వేడుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవంఅత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఓటు హక్కుతో దేశ తలరాతను మార్చే శక్తి యువతకు లభిస్తుందిఅందుకే మనం దేశంలో కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందిప్రతి ఏటా జనవరి 25న ఓ బృహత్ కార్యక్రమాన్ని ఎన్‌సీసీ-ఎన్ఎస్ఎస్మేరా యువ భారత్మై భారత్ సంస్థలు నిర్వహించాలని కోరుకుంటున్నానుమొదటిసారి ఓటు వేసిన వారిని సత్కరించే కార్యక్రమం జరగాలిఇది మన యువతలో బాధ్యతను పెంపొందిస్తుందనిదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

స్నేహితులారా,

ఆర్థిక సంక్షేమానికి మాత్రమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్పరిమితం కాలేదుఅభివృద్ధి చెందిన భారత్‌ సాధనలో పౌరునిగా మన ప్రవర్తన కూడా ముఖ్యమైనదేపౌరునిగా మన బాధ్యతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలిఉదాహరణకుస్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి ఉండొచ్చుకానీ దానిని దేశ ప్రజలుయువతచిన్నారులు ముందుకు తీసుకెళ్లారని గర్వంగా చెబుతానుఇంటి లోపలావెలుపలా కూడా పరిశుభ్రత ఓ అలవాటుగాజీవనశైలిగావిలువగా మారాలిఈ పౌర బాధ్యతను మన జీవితాల్లో భాగం చేసుకోవాలిమన వాకిలి ఎలా అందంగా ఉండాలనుకుంటామో.. అదే భావనతో మన నగరాన్ని కూడా అందంగా ఉంచాలివారంలో ఏదో ఒక రోజు గంట పాటు స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాలని ఇక్కడ ఉన్న ప్రతి యువ స్నేహితుడిని నేను కోరుతున్నానుఎన్‌సీసీ-ఎన్ఎస్ఎస్ దీన్ని సమర్థంగా చేయగలుగుతాయిమీ ప్రాంతాల్లో ఏదైనా కార్యక్రమాన్ని కచ్చితంగా చేపట్టండి.

స్నేహితులారా,

ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం ద్వారా లక్షల మొక్కలను ఎన్‌సీసీ నాటిందని తెలిసి చాలా సంతోషించానుమనం నాటిన మొక్కలు బాగా పెరిగేలా చూడటం కూడా మన బాధ్యత.

స్నేహితులారా,

భవిష్యత్తులో ఎంత ఆరోగ్యంగా ఉంటామనేదే యువతకు పెద్ద పరీక్షశారీరక దారుఢ్యం అంటే.. కొన్ని నిమిషాలు చేసే వ్యాయామాలకి మాత్రమే పరిమితమైన అంశం కాదుఅది మన జీవన విధానంగా మారాలిమన ఆహారపు అలవాట్ల నుంచి దైనందిన జీవితం వరకు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరంఫిట్ ఇండియా కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళుతున్నారని తెలిసి చాలా సంతోషించానుక్రీడల్లో కూడా ఎన్‌సీసీ క్యాడెట్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.

స్నేహితులారా,

ఊబకాయం సమస్య గురించి నేను మరోసారి మాట్లాడుతున్నానుభవిష్యత్తులో దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయిఊబకాయం వల్ల మధుమేహంరక్తపోటుఇతర వ్యాధులు కూడా దేశంలో పెరిగిపోతాయిదీనివల్ల ఎక్కువ ప్రభావితమయ్యేది యువతేఅందుకే ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలినూనెల వినియోగాన్ని తగ్గించాలికొంత కాలం క్రితం ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని విజ్ఞప్తి చేశానుఈ రోజు అదే విషయాన్ని యువతకు మరోసారి గుర్తు చేస్తున్నాను.

స్నేహితులారా,

కేవలం కదమ్‌తాల్ మాత్రమే మీకు ఎన్‌సీసీ నేర్పించడం లేదుబాధ్యతాయుతమైన పౌరునిగా ఎలా జీవించాలో కూడా మీకు నేర్పిస్తుందిఇక్కడ మీరు నేర్చుకున్న నైపుణ్యాలువిలువలు మంచి పౌరునిగా ఎదిగేందుకు తోడ్పడతాయిగణతంత్ర దినోత్సవాల్లో మీకు దొరికే అనుభవాలు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయిజీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ మీరు విజయం సాధించాలనిఅభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్నిర్మాణంలో మీ సహకారం పెరగాలని ఆకాంక్షిస్తున్నానుమీ అందరికీ శుభాకాంక్షలు.

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై!

వందేమాతరం 150 వసంతోత్సవాలను దేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో నాతో కలసి చెప్పండి

వందేమాతరంవందేమాతరం!

వందేమాతరంవందేమాతరం!

వందేమాతరంవందేమాతరం!

వందేమాతరంవందేమాతరం!

వందేమాతరంవందేమాతరం!

వందేమాతరంవందేమాతరం!

ధన్యవాదాలు.

 

***


(రిలీజ్ ఐడి: 2220875) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam