ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిగుబడుల్లో పెరుగుదల, విధానం, సంస్థాగత కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం: ఆర్థిక సర్వే


స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత కార్యక్రమం: ఆర్థిక సర్వే

2023-24 నాటికి 121.75 లక్షల టన్నులకు చేరుకున్న దేశీయ వంట నూనె నిల్వలు: వంట నూనె దిగుమతులపై ఆధారపడటం 2015-16లో 63.2 శాతం నుంచి 2023-24 నాటికి 56.25 శాతానికి తగ్గింది

100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో అమలు కానున్న ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన: 4.19 కోట్ల మంది రైతులకు బీమా, ఆర్థిక సంవత్సరం 23తో పోలిస్తే.. 25లో 32 శాతం పెరుగుదల

प्रविष्टि तिथि: 29 JAN 2026 2:02PM by PIB Hyderabad

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పంట దిగుబడులనురాబడిని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొందిఈ సర్వేను కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టారు.

పెట్టుబడి వనరులుసాంకేతికతఆదాయ తోడ్పాటుమార్కెట్ ఆధారితబీమా తోడ్పాటు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారువీటిలో అనేక ప్రాధాన్య కార్యక్రమాలు.. యుద్ధ ప్రాతిపదికన అమలయ్యాయి.

దేశ వ్యాప్తంగా వరిగోధుమపప్పులుతృణ ధాన్యాలు (మొక్కజొన్నబార్లీ), వాణిజ్య పంటలు (పత్తిజనపనారచెరకు), పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు (శ్రీ అన్నఉత్పాదక సామర్థ్యాన్నిదిగుబడులను పెంపొందించడానికి 2007 నుంచి జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం (ఎన్ఎఫ్ఎస్ఎంఅమలవుతోందిసాగు విస్తీర్ణం పెంపుఉత్పాదక విస్తరణ ద్వారా దీనిని చేపడుతున్నారుఈ పథకం పేరును ఆర్థిక సంవత్సరం 25లో జాతీయ ఆహార భద్రతపోషణ కార్యక్రమం (ఎన్ఎఫ్ఎస్ఎన్‌ఎం)గా మార్చారు.

నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా జాతీయ వంట నూనెలునూనె గింజలు (ఎన్ఎంఈవో-ఓఎస్కార్యక్రమంజాతీయ వంటనూనెలు-ఆయిల్‌పామ్ (ఎన్ఎంఈవో-ఓపీకార్యక్రమం అమలవుతున్నాయిఉత్పాదకత విస్తరణమెరుగుపరిచిన వంగడాలుఉత్తమ వ్యవసాయ పద్ధతులుప్రైవేటు రంగ భాగస్వామ్యంక్లస్టర్ ఆధారిత కార్యక్రమాలుపంట సేకరణకు హామీ ద్వారా 2030-31 నాటికి దాదాపు 70 మిలియన్ టన్నుల దిగుబడిని సాధించడమే వీటి లక్ష్యం.

ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా పప్పు ధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భరత కార్యక్రమం 2025 అక్టోబర్ 1న ఆమోదం పొందిందిపప్పు ధాన్యాల్లో స్వావలంబన సాధించడమే దీని లక్ష్యంఈ కార్యక్రమాలన్నింటి ద్వారా నూనె గింజలుపామాయిల్ సాగుదిగుబడిలో గణనీయమైన పెరుగుదల కనిపించిందినూనె గింజలు సాగు విస్తీర్ణం 2014-15, 2024-25 మధ్య కాలంలో 18 శాతానికి పైగా పెరిగిందిఅలాగే దిగుబడి దాదాపుగా 55 శాతంఉత్పాదకత సుమారుగా 31 శాతం మేర పెరిగాయి.

దేశీయంగా అందుబాటులో ఉన్న వంట నూనె నిల్వలు 2015-16లో 86.30 లక్షల టన్నుల నుంచి 2023-24 నాటికి 121.75 లక్షల టన్నులకు చేరుకున్నాయిదేశంలో వంట నూనెలకు డిమాండువినియోగం పెరిగినప్పటికీ దిగుమతులు 2015-16లో 63.2 శాతం నుంచి 2023-24లో 56.25 శాతానికి తగ్గాయి.

ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన: అందరికీ సంక్షేమాన్ని అందించడమే ధ్యేయంగా 2025 వార్షిక బడ్జెట్టులో పీఎం ధన ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవైద్వారా 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించిందిఆరేళ్ల కాల వ్యవధితో ఆర్థిక సంవత్సరం 26 నుంచి 100 జిల్లాల్లో అమలయ్యేలా పీఎండీడీకేవైకు జులై 2025లో ఆమోదం లభించింది.

వ్యవసాయ ఉత్పాదకతను విస్తరించడంపంటల వైవిద్యీకరణనుసుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడంపంచాయతీబ్లాకు స్థాయుల్లో గిడ్డంగి సౌకర్యాలను పెంపొందించడంనీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడంస్వల్పకాలికదీర్ఘకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి.

పంట బీమా తోడ్పాటుప్రకృతి వైపరీత్యాలుచీడపీడలుతీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే పంట నష్టం నుంచి రైతులకు రక్షణను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవైకల్పిస్తుంది2024-25లో 4.19 కోట్ల మంది రైతులకు బీమాను ఈ పథకం అందించింది. 2022-23తో పోలిస్తే ఇది 32 శాతం మేర పెరిగింది. 6.2 కోట్ల హెక్టార్ల భూమికి కవరేజీ లభించిందిగతేడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం.

భారత జాతీయ ఆదాయంలో ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయందాని అనుబంధ కార్యకలాపాలకు దాదాపుగా అయిదో వంతు వాటా ఉందని ఈ సర్వే తేల్చిందిఉపాధి కల్పనలో వ్యవసాయంఅనుబంధ కార్యకలాపాలకు సాపేక్షంగా అతిపెద్ద వాటా ఉండటంతో.. దేశ మొత్తం వృద్ధికి కేంద్రంగా ఈ రంగం నిలిచిందిఅందుకే సమ్మిళిత వృద్ధికిఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం.

 

***


(रिलीज़ आईडी: 2220172) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Kannada , Malayalam