ప్రధాన మంత్రి కార్యాలయం
భారత సైన్య ఘన వారసత్వ శక్తిని చాటిన బీటింగ్ రిట్రీట్ వేడుక: ప్రధానమంత్రి
విజయంలో వివేకం, ఆత్మగౌరవం ముఖ్యమని సూచించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
29 JAN 2026 9:51AM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవాల సమాప్తికి బీటింగ్ రిట్రీట్ వేడుక ఓ ప్రతీక అనీ, భారత సైన్య ఘన వారసత్వానికున్న శక్తిని ఈ వేడుక చాటిచెప్తుందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మన సాయుధ దళాల్ని చూసి మనమెంతో గర్వపడుతున్నాం, మన సాయుధ దళాలు దేశ రక్షణకు అంకిత భావంతో సేవలందిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఒక యోధుడు విజయ పథంలో కదం తొక్కే క్రమంలో, విజయ సాధనకు అవసరమైన వివేకానికీ, విజయ ప్రాప్తిలో ఆత్మ గౌరవానికీ ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘ఏకో బహునామసి మన్య ఈడితా విశం విశం యుద్ధాయ సం శిశాధి
అకృత్తరుక్త్వయా యుజా వయం ధ్యుమన్తం ఘోషం విజయాయ కృణ్మసి’’
ఈ సుభాషితం.. ‘‘ఓ వీర యోధా. నీ క్రోధాన్ని వివేకంతో అదుపులో పెట్టుకో. నువ్వు వేల మందిలో నాయకుడివి. సమ్మాన సహితంగా పాలించడాన్నీ, పోరాడటాన్నీ నీ ప్రజలకు నేర్పించు. ఈ విజయ యాత్రలో మేం సహర్షంగా నీతో పాటు అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాం’’ అనే సందేశాన్ని అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి -
‘‘ఈ రోజు సాయంత్రం బీటింగ్ రిట్రీట్ వేడుకను నిర్వహిస్తారు. ఇది గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల సమాప్తికి ప్రతీకగా నిలుస్తుంది. దీనిలో భారత సైన్య సమృద్ధ వారసత్వ శక్తిని మనం గమనించవచ్చును. దేశ రక్షణకు అంకితమైన మన సాయుధ దళాలు మనకెంతో గర్వకారణంగా ఉన్నాయి.
‘‘ఏకో బహునామసి మన్య ఈడితా విశం విశం యుద్ధాయ సం శిశాధి
అకృత్తరుక్త్వయా యుజా వయం ధ్యుమన్తం ఘోషం విజయాయ కృణ్మసి’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2220047)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam