ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సర్ మార్క్ టల్లీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 JAN 2026 7:11PM by PIB Hyderabad

జర్నలిజం రంగంలో విశిష్ట స్థానం కలిగిన సర్ మార్క్ టల్లీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సర్ మార్క్ టల్లీకి భారత్‌తో, ఇక్కడి ప్రజలతో ఉన్న లోతైన అనుబంధం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్క్ అందించిన వార్తా కథనాలు, విశ్లేషణలు ప్రజా చర్చలపై చెరగని ముద్ర వేశాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ కష్టకాలంలో సర్ మార్క్ టల్లీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఆయనను అభిమానించే వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

‘‘జర్నలిజంలో మహోన్నత వ్యక్తి అయిన సర్ మార్క్ టల్లీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. భారత్‌తో, దేశ ప్రజలతోనూ టల్లీకి ఉన్న అనుబంధం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తుంది. ఆయన రిపోర్టింగ్, లోతైన విశ్లేషణలు ప్రజా క్షేత్రంలో దీర్ఘకాలం ప్రభావం చూపాయి. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం’’


(रिलीज़ आईडी: 2218888) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam , Malayalam