ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరులే ప్రధానంగా సాగే పాలన, రాజ్యాంగ విలువలపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2026 5:20PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
నేటి పాలనలో పౌరులే ప్రధానమని ఈ కథనం వివరిస్తుంది. సామాజిక న్యాయాన్ని పెంపొందిస్తూ, ఆర్థిక సమ్మిళితత్వాన్ని మన గణతంత్ర రాజ్యం సాధ్యం చేస్తుందని, ఈ ఉమ్మడి కృషి ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ ప్రజాస్వామ్య గణతంత్ర దార్శనికతను కాపాడుతుందని పేర్కొంటుంది.
పైన చెప్పిన కథనంపై రక్షణ మంత్రి చేసిన 'ఎక్స్' పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"గణతంత్ర దినోత్సవం సందర్భంగా, నేటి పరిపాలనలో పౌరులే ప్రధానమని రక్షణమంత్రి శ్రీ @rajnathsingh ji తెలిపారు. మన గణతంత్రం సామాజిక న్యాయాన్ని పెంపొందించటంతో పాటు ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధ్యం చేస్తోందని ఆయన అన్నారు. మన రాజ్యాంగం ఆశించిన సంక్షేమ ఆధారిత ప్రజాస్వామ్య గణతంత్ర దార్శనికతను ఈ ఉమ్మడి కృషి నిలబెడుతుంది".
(रिलीज़ आईडी: 2218881)
आगंतुक पटल : 9