హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ రోజు పశ్చిమ సింగ్‌భూమ్‌లో సీఆర్‌పీఎఫ్, జార్ఖండ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌… నక్సల్ వ్యతిరేక పోరాటంలో పెద్ద విజయం


రూ. కోటి రివార్డు గల నక్సలైట్ కేంద్ర కమిటీ సభ్యుడు 'అనల్ అలియాస్ పతిరామ్ మాంఝీ'

సహా మరో 15 మంది నక్సలైట్లు హతం

దశాబ్దాలుగా భయానికీ, తీవ్రవాదానికి మారుపేరుగా ఉన్న నక్సలిజాన్ని

మార్చి 31లోగా పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం


హింస, తీవ్రవాదం, ఆయుధాల భావజాలాన్ని విడిచి... అభివృద్ధి, విశ్వాసాలతో చేరాలని మిగిలిన

నక్సలైట్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

प्रविष्टि तिथि: 22 JAN 2026 8:28PM by PIB Hyderabad

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లో ఈ రోజు నిర్వహించిన ఆపరేషన్‌లో రూ. 1 కోటి రివార్డు ఉన్న అగ్రశ్రేణి నక్సలైట్కేంద్ర కమిటీ సభ్యుడు 'అనల్ అలియాస్ పతిరామ్ మాంఝీ'తో పాటు మరో 15 మంది నక్సలైట్లను హతమార్చడం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఒక పెద్ద విజయమని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.

 ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టులో కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు...

ఈ రోజు పశ్చిమ సింగ్‌భూమ్‌లో సీఆర్‌పీఎఫ్జార్ఖండ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్... నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పెద్ద విజయాన్ని సాధించిందిరూ.1 కోటి రివార్డు గల నక్సలైట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు 'అనల్ అలియాస్ పతిరామ్ మాంఝీసహా మరో 15 మంది నక్సలైట్లు హతమయ్యారుమిగిలిన నక్సలైట్లు హింసతీవ్రవాదంఆయుధాలతో ముడిపడి ఉన్న భావజాలాన్ని విడిచిపెట్టి... అభివృద్ధి పథంలో భాగం కావాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2217476) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati