లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

బడ్జెట్‌ సమావేశాల్లో సభ సజావుగా సాగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సభ్యులకు విజ్ఞప్తి చేసిన లోక్‌సభ స్పీకర్


పథకం ప్రకారం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దన్న శ్రీ ఓం బిర్లా

లక్నోలో జరిగిన 86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీ) ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన లోక్‌సభ స్పీకర్

2047 నాటికి 'వికసిత్‌ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో శాసనసభలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్న లోక్‌సభ స్పీకర్

శాసనసభలను మరింత ప్రభావవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు 'జాతీయ శాసన సూచిక' తయారు చేయనున్నట్లు తెలిపిన లోక్‌సభ స్పీకర్

రాష్ట్ర శాసనసభల్లో ఏడాదికి కనీసం 30 సమావేశాలు జరిగేలా చూడాలన్న లోక్‌సభ స్పీకర్

సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ధోరణిని కాకుండా చర్చ, సంవాద సంప్రదాయాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన లోక్‌సభ స్పీకర్

రాజ్యాంగ సంరక్షకులుగా, ప్రజాస్వామ్య మర్యాదలకు కాపలాదారులుగా శాసన సభాపతులు ఉండాలన్న లోక్‌సభ స్పీకర్

प्रविष्टि तिथि: 21 JAN 2026 6:45PM by PIB Hyderabad

86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీముగింపు కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పాల్గొన్నారుఉత్తరప్రదేశ్ విధాన్‌ భవన్‌లో 2026 జనవరి 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరిగింది

ఈ సదస్సు చివరి సెషన్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిరాజ్యసభ ఉపాధ్యక్షుడుఉత్తరప్రదేశ్ శాసన మండలి చైర్మన్ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ మాట్లాడారు

ముగింపు కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ మాట్లాడుతూ.. శాసనసభలను మరింత ప్రభావవంతంగాప్రజల అవసరాలకు అనుగుణంగాజవాబుదారీగా మార్చడానికి 'జాతీయ శాసన సూచికతయారు చేయనున్నట్లు తెలిపారుఇది శాసనసభల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చల నాణ్యతపనితీరును మెరుగుపరుస్తుందని అన్నారుదీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సమర్థవంతమైన వేదికలుగా శాసనసభలు మారాలంటే రాష్ట్ర శాసనసభలలో ఏడాదికి కనీసం 30 సమావేశాలు జరిగేలా చూడాలని శ్రీ బిర్లా అన్నారుసభ ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే అంత అర్థవంతమైనతీవ్రమైనఫలితాల ఆధారిత చర్చలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.

పత్రికా సమావేశంలో కూడా లోక్‌సభ స్పీకర్ మాట్లాడారురాబోయే బడ్జెట్ సమావేశాల్లో సభా కార్యకలాపాలు సజావుగా నిర్వహించటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సభలో నిరంతరంపథకం ప్రకారం కలిగించే ఆటంకాలు దేశ ప్రజాస్వామ్యానికి తగవని పేర్కొన్నారుసభకు అంతరాయం కలిగినప్పుడు అందరికంటే ఎక్కువగా నష్టపోయేది ప్రజలే అని ఆయన అన్నారుఆటంక పరిచే సంస్కృతిని కాకుండా చర్చసంవాద సంప్రదాయాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

సభ సజావుగా సాగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులుసభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారుప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమన్న ఆయన.. ప్రజల పట్ల జవాబుదారీతనం కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రతిరోజూప్రతిక్షణం ఉండాలని పేర్కొన్నారు

శాసన సభాపతులు కేవలం సభా కార్యకలాపాలను నిర్వహించేవారు మాత్రమే కాదని రాజ్యాంగ సంరక్షకులుగా,  ప్రజాస్వామ్య మర్యాదలకు కాపలాదారులుగా ఉంటారని లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యానించారుసభాపతుల నిష్పాక్షికతసున్నితత్వందృఢత్వం... సభ సాగే దిశను నిర్ణయిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు

86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సులో మొత్తం ఆరు ముఖ్యమైన తీర్మానాలకు ఆమోదం లభించింది:

తీర్మానం 1:  2047 నాటికి 'వికసిత్‌ భారత్అనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు కృషి చేయడానికి సభాపతులందరూ సంబంధిత శాసనసభల కార్యకలాపాల నిర్వహణకు పునరంకితం కావాలి

తీర్మానం 2: అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించటం ద్వారా రాష్ట్ర శాసనసభల్లో ఏడాదికి కనీసం ముప్పై (30) సమావేశాలు నిర్వహించాలిప్రజాస్వామ్య సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూసుకునేందుకు శాసన పనుల కోసం అందుబాటులో ఉన్న సమయంవనరులను నిర్మాణాత్మకంగాసమర్థవంతంగా ఉపయోగించుకోవాలి

తీర్మానం 3: ప్రజలుశాసనసభలకు మధ్య సమర్థవంతమైన అనుసంధానాన్ని ఏర్పరచడానికిఅర్థవంతమైన భాగస్వామ్య పరిపాలనను నిర్ధారించేందుకు శాసన పనులను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం బలోపేతం చేయాలి

తీర్మానం 4: దేశానికి ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయాలువిలువలు మరింత లోతుగాబలంగా మారేలా చూసేందుకు భాగస్వామ్య పరిపాలనకు సంబంధించిన అన్ని సంస్థలకు ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని ఇక ముందు కూడా అందించాలి

తీర్మానం 5: శాసనసభల్లో జరిగే చర్చలుసంవాదాలలో ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పాల్గొనేలా చూసేందుకు డిజిటల్ సాంకేతికత వినియోగంలో పార్లమెంట్శాసనసభ సభ్యుల సామర్థ్యాన్ని పెంపొందించడంపరిశోధన విశ్లేషణాత్మక మద్దతును ఇక ముందు కూడా నిరంతరం కొనసాగించాలి

తీర్మానం 6: బహిరంగ ప్రయోజనాల దృష్ట్యా గరిష్ఠ జవాబుదారీతనంతో కూడిన ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడానికినిర్ణీత ప్రమాణాల ఆధారంగా శాసన సభల పనితీరును నిష్పాక్షికంగా అంచనా వేయటంతో పాటు సరిపోల్చేందుకు ఒక 'జాతీయ శాసన సూచిక'ను రూపొందించాలి.

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సమక్షంలో జరిగిన ఈ మూడు రోజుల సదస్సుకు సంబంధించిన ప్లీనరీ సెషన్లలో మూడు ప్రధానాంశాలపై చర్చించారు:

పారదర్శకమైనసమర్థవంతమైనప్రజా కేంద్రిత శాసన ప్రక్రియల కోసం సాంకేతికతను ఉపయోగించటం.

పనితీరును మెరుగుపరచడానికిప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు చట్ట సభల ప్రతినిధుల సామర్థ్యాన్ని పెంపొందించడం

ప్రజల పట్ల శాసనసభల జవాబుదారీతనం.

ఈ సదస్సులో దేశంలోని 24 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది శాసనసభాపతులు పాల్గొన్నారుభాగస్వామ్యం పరంగా 86వ ఏఐపీఓసీ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సదస్సుగా నిలిచింది

అఖిల భారత శాసన సభాపతుల సదస్సు వంటి వేదికలు ప్రజాస్వామ్య సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయనిపరస్పర సమన్వయాన్ని బలోపేతం చేస్తాయనిపాలనను మరింత ప్రభావవంతంగా చేయడంలో సహాయపడతాయని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు

సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంఉత్తరప్రదేశ్ శాసనసభశాసనమండలిలోక్‌సభ రాజ్యసభ కార్యాలయాలతో పాటు పాల్గొన్న సభాపతులుప్రతినిధులందరికీ లోక్‌సభ స్పీకర్ ‌కృతజ్ఞతలు తెలియజేశారు

భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠంగాజవాబుదారీగాప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చే దిశగా 86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది

 

***


(रिलीज़ आईडी: 2217112) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada