హోం మంత్రిత్వ శాఖ
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం.. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
చైతన్యవంతమైన సంస్కృతితో, ప్రతిభావంతులైన ప్రజలతో అలరారుతున్న మణిపూర్ మనకు ఎప్పటికీ గర్వకారణం
అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటున్న త్రిపుర ప్రస్తుతం భారత్ ప్రగతికి గొప్ప తోడ్పాటును అందిస్తున్న రాష్ట్రంగా పేరుతెచ్చుకుంది
జీవ వైవిధ్యానికీ, సంస్కృతులు, ఆచార వ్యవహారాలకీ నిలయంగా భాసిస్తున్న మేఘాలయ దేశ స్ఫూర్తికి గొప్ప శక్తిని జోడిస్తోంది
प्रविष्टि तिथि:
21 JAN 2026 12:53PM by PIB Hyderabad
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయా రాష్ట్రాలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వరుస సందేశాల్ని పొందుపరుస్తూ ‘‘మణిపూర్‌లోని మన సోదరీ, సోదరులకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చైతన్యవంతమైన సంస్కృతి, ప్రతిభావంతులైన ప్రజలతో అలరారుతున్న మణిపూర్ సదా మనకు గర్వకారణంగా నిలుస్తోంది. రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రం నూతన శిఖరాల్ని అందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
‘‘మేఘాలయ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హార్దిక శుభకామనలు. గొప్ప జీవవైవిధ్యంతో తొణికిసలాడుతున్న, సంస్కృతులు- ఆచార వ్యవహారాల మేలికలయిక అయిన మేఘాలయ.. భారత్ ఉత్సాహానికి అపార శక్తిని అందిస్తోంది. ఈ రాష్ట్రం ప్రగతి ప్రస్థానంలో సరికొత్త మజిలీలను అధిగమించాలని నేను కోరుకుంటున్నాను’’ అని శ్రీ అమిత్ షా అన్నారు.
‘‘త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్రానికి చెందిన మన సోదరీ, సోదరులకు ఇవే శుభాకాంక్షలు. అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటున్న త్రిపుర.. ప్రస్తుతం భారత్ ప్రగతికి గొప్ప తోడ్పాటును అందించే రాష్ట్రంగా పేరుతెచ్చుకుంది. మోదీ జీ నాయకత్వంలో, ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నెరవేరుస్తూ రాష్ట్రానికి సమర్థ సారథ్యాన్ని అందించడాన్ని కొనసాగించాలని నేను అభిలషిస్తున్నాను’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 2216885)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam