ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 21 JAN 2026 9:26AM by PIB Hyderabad

త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

త్రిపుర ప్రస్థానం సంప్రదాయం, ఆధునికతల అసాధారణ కలబోతకు ప్రతీకగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. వివిధ రంగాల్లో ఈ రాష్ట్రం మార్గదర్శక మార్పులకు సాక్షిగా నిలిచిందని, ఈ రాష్ట్ర ప్రజలు భారతదేశ అభివృద్ధి వేగంగా దూసుకుపోయేందుకు తోడ్పడుతున్నారని ఆయన అన్నారు.

రాబోయే కాలంలో త్రిపురలో చెప్పుకోదగ్గ సమృద్ధి చోటు చేసుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘త్రిపుర  ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హార్దిక శుభకామనలు. సంప్రదాయం, ఆధునికతల అసాధారణ కలబోతకు ప్రతీకగా త్రిపుర ముందుకు సాగుతోంది. వివిధ రంగాల్లో మార్గదర్శక మార్పులకు సాక్షిగా ఈ రాష్ట్రం నిలిచింది.. భారతదేశ అభివృద్ధి వేగంగా దూసుకుపోయేందుకు రాష్ట్ర ప్రజలు తోడ్పాటును అందిస్తున్నారు. రాబోయే కాలంలోనూ త్రిపుర గొప్పగా పురోగమించాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2216726) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam