ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
మకర సంక్రాంతి పవిత్రతను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
14 JAN 2026 10:24AM by PIB Hyderabad
శుభప్రదమైన మకర సంక్రాంతి ఈ రోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతకు అద్దం పట్టే పండగే మకర సంక్రాంతి.. సద్భావన, సమృద్ధిలతో పాటు కలుపుగోలుతనం భావనకు కూడా ప్రతీక ఈ పర్వదినమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నువ్వులతో బెల్లం కలబోసి చేసే మధుర పదార్థం అందరి జీవితాల్లో సంతోష సాఫల్యాలను ప్రసాదించాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే సూర్య దేవుని ఆశీస్సులు దేశ ప్రజలకు సంక్షేమాన్ని కలగజేయాలని ప్రార్థించారు.
సూర్య భగవానుని ఆశీర్వాదాలను కోరుకుంటూ, ఈ పండుగకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని కూడా ప్రజలతో శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘మకర సంక్రాంతి సందర్భంగా దేశవాసులందరికీ అనేకానేక శుభకామనలు. నువ్వులు, బెల్లం కలగలిసిన తీయదనంతో నిండి ఉండే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సంకేతమైన ఈ దివ్య దినం ప్రతి ఒక్కరి జీవనంలో ప్రసన్నతనీ, సంపన్నతనీ, సఫలతనీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సూర్యదేవుడు అందరికీ మేలు చేయుగాక’’.
‘‘పవిత్రమైన ఈ సంక్రాంతి పండుగను దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆయా స్థానిక ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జరుపుకొంటారు. సూర్యదేవుడు అందరికీ సుఖం, సమృద్ధిలతో పాటు ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను.
సూర్యో దేవో దివం గచ్ఛేత్ మకరస్థో రవిః ప్రభుః
ఉత్తరాయణే మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2214996)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam