ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని జనవరి 15న ప్రారంభించనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 JAN 2026 11:19AM by PIB Hyderabad

కామన్‌వెల్త్ స్పీకర్లుప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని (సీఎస్‌పీఓసీన్యూఢిల్లీలోని పార్లమెంటు భవన సముదాయంలో గల సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 2026 జనవరి 15న ఉదయం 10:30కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.  
కామన్‌వెల్త్‌కు చెందిన 42 దేశాలతో పాటు ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన అర్థ స్వయంప్రతిపత్తి కల చట్టసభల స్పీకర్లుప్రిసైడింగ్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారుఈ సమావేశానికి లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తారు.
పార్లమెంట్లకు సంబంధించిన వర్తమాన అంశాలనేకం ఈ సమావేశంలో చర్చకు రానున్నాయిప్రజాస్వామిక సంస్థల్ని సమర్థంగా నిర్వహించడంలో స్పీకర్లుప్రిసైడింగ్ అధికారుల పాత్రపార్లమెంటులలో కృత్రిమ మేధను ఉపయోగించడంపార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావంపార్లమెంటు పనితీరును ప్రజలు ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా అర్థం చేసుకొనేటట్లుగానూకేవలం ఓటు వేయడానికే కాకుండా ఇతర విధాలుగా కూడా పౌరులు బాధ్యతగా నడుచుకోవడాన్ని పెంపొందించేటట్లుగానూ అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2214995) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam