ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో జనవరి 12న పాల్గొననున్న ప్రధానమంత్రి


ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ప్రతినిధులతో పాటు దేశం నలుమూలలకు చెందిన 3,000 మంది యువ నాయకులతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి

ఎంపిక చేసిన ప్రతినిధులచే జాతీయ ప్రాధాన్యమున్న పది కీలక అంశాలపై ప్రధానికి ప్రజెంటేషన్
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో పాల్గొన్న 50 లక్షల మంది

प्रविष्टि तिथि: 10 JAN 2026 10:00AM by PIB Hyderabad

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారున్యూఢిల్లీలో భారత మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి జనవరి 12, సాయంత్రం 4:30 గంటలకు ఆయన హాజరవుతారు.

ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ప్రతినిధులతో పాటుగా దేశం నలుమూలలకు చెందిన 3,000 మంది యువతతో ప్రధానమంత్రి ముచ్చటిస్తారుఎంపిక చేసిన వారు 10 కీలకాంశాలపై ప్రధానమంత్రికి తమ ప్రజెంటేషన్ ఇస్తారుజాతీయ ప్రాధాన్యమున్న రంగాల్లో యువతకున్న దృక్పథాలుఆచరణ సాధ్యమైన ఆలోచనలను వారు వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026 వ్యాసాల సంకలనాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారుదీనిలో దేశాభివృద్ధి ప్రాధాన్యతలుదీర్ఘకాలిక దేశ నిర్మాణ లక్ష్యాల గురించి యువత రాసిన వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటిని ప్రచురించారు.

భారత యువతజాతీయ నాయకత్వం మధ్య నిర్మాణాత్మక అనుసంధానాన్ని అందించే జాతీయ వేదికగా రెండో విడత వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌‌ను రూపొందించారుఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను ఈ రంగంలోకి తీసుకురావాలని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఉందిఇది వికసిత్ భారత్ కోసం వారి ఆలోచనలు వాస్తవరూపం దాల్చేలా జాతీయ వేదికను అందిస్తుంది.

2026 జనవరి నుంచి 12 వరకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026ను నిర్వహిస్తున్నారుదేశవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 లక్షల మంది యువత పాల్గొన్నారుడిజిటల్ క్విజ్వ్యాసరచన పోటీలురాష్ట్ర స్థాయి విజన్ ప్రజెంటేషన్లతో ఈ పోటీలను మూడు దశలుగా నిర్వహించారుప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు యువ నాయకులను ఎంపిక చేశారు.

మొదటి సంచికకకు కొన్ని కీలకమైన మార్పులు చేసి రెండో సంచికను రూపొందిచారుదీనిలో డిజైన్ ఫర్ భారత్టెక్ ఫర్ వికసిత్ భారత్ హ్యాక్ ఫర్ ఏ సోషల్ కాజ్మరింత విస్తరించిన ఇతివృత్తాలు ఉన్నాయివీటితో పాటుగా మొదటిసారిగా అంతర్జాతీయ భాగస్వామ్యానికి చోటు కల్పించారుఇవి ఈ కార్యక్రమ పరిధినిప్రభావాన్ని మరింత బలోపేతం చేశాయి.

 

***


(रिलीज़ आईडी: 2213664) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam