మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నాలుగు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో కొత్త రికార్డును నెలకొల్పిన పరీక్షా పే చర్చ: శ్రీ ధర్మేంద్ర ప్రదాన్
प्रविष्टि तिथि:
10 JAN 2026 1:28PM by PIB Hyderabad
‘పరీక్షా పే చర్చ-2026’ కు ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు వెల్లడించారు. గతేడాది గిన్నిస్ ప్రపంచ రికార్డుగా నిలిచిన 3.56 కోట్ల రిజిస్ట్రేషన్లను ఈ సంవత్సరం అధిగమించామని ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించే వార్షిక చర్చా కార్యక్రమంగా మాత్రమే ఇది పరిమితం కాకుండా.. దేశ యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించే జాతీయ ఉద్యమంగా పరిణామం చెందిందని ఆయన తెలిపారు.
‘పరీక్షా పే చర్చ-2026’లో విద్యార్థులంతా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో.. విశ్వాసం, ఏకాగ్రత, ఆరోగ్యంపై ప్రధానమంత్రి అందించే మాస్టర్‌క్లాస్ ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని ఆయన వివరించారు.
ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘పరీక్షా పే చర్చ’ (పీపీసీ) కార్యక్రమం చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. 2026 జనవరి 8 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఖ్య నాలుగు కోట్లను దాటింది.
ఈ కార్యక్రమానికి పెరుగుతున్న మద్దతును ఈ అపూర్వ స్పందన సూచిస్తుంది. అలాగే సానుకూలమైన, నమ్మకమైన, ఒత్తిడి లేని పరీక్షా విధానాన్ని ప్రోత్సహిస్తూ.. విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం సాధించిన విజయాన్ని కూడా తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అనుసంధానిస్తూ.. ప్రజా ఉద్యమంగా ‘పరీక్షా పే చర్చ’ ఉద్భవించిందన్న అంశాన్ని ఈ వైవిధ్యమైన, విస్తృతమైన భాగస్వామ్యం తెలియజేస్తోంది. ఇది వార్షిక చర్చగా మాత్రమే తన పరిధిని పరిమితం చేసుకోకుండా విద్య, ఆరోగ్యం, సమ్రగాభివృద్ధికి సంబంధించిన జాతీయ కార్యక్రమంగా రూపాంతరం చెందింది.
‘పరీక్షా పే చర్చ-2026’కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 2025 డిసెంబర్ 1న మైగవ్ పోర్టల్లో ప్రారంభమయ్యాయి. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు నేరుగా ప్రధానమంత్రితో సంభాషించే వీలు కల్పించే వేదికగా విస్తృత గుర్తింపు పొందింది.
పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ‘పరీక్ష పే చర్చ’లో పాల్గొని ఒత్తిడిని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రధానమంత్రి మార్గదర్శకత్వం పొందాలని ప్రోత్సహిస్తున్నారు.
పరీక్షా పే చర్చ-2026లో పాల్గొనేందుకు నమోదు చేసుకోండి: https://innovateindia1.mygov.in/
***
(रिलीज़ आईडी: 2213651)
आगंतुक पटल : 8