ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యువశక్తిపై స్వామి వివేకానందుని నమ్మకాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 JAN 2026 10:11AM by PIB Hyderabad

దేశాభివృద్ధిలో యువశక్తి అత్యంత ప్రధానమైనదనీశ్రద్ధఆసక్తితో తమ లక్ష్యాన్ని భారతీయ యువత నెరవేర్చుకోగలదనే స్వామి వివేకానందుని నమ్మకాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।

వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"

ధైర్యంగాదృఢ నిశ్చయంతో ఉండేవారికి ఈ భూమి ఇంటి ముందున్న వాకిలి వంటిదనీసముద్రాలు చెరువుల్లాంటివనీమేరు పర్వతం సైతం చిన్న పుట్టలా కనిపిస్తుందనీదృఢ సంకల్పం ఉన్నవారికి ఈ పుడమిపై సాధించలేనిది ఏమీ లేదని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘దేశాభివృద్ధికి అత్యంత శక్తిమంతమైన ఆధారం యువశక్తి అని స్వామి వివేకానంద విశ్వసించారుఉత్సాహంపట్టుదలతో భారతీయ యువత తమ సంకల్పాన్ని నెరవేర్చుకోగలదు.

"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।

వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"


(రిలీజ్ ఐడి: 2213622) సందర్శకుల సూచీ సంఖ్య : : 27