ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం
प्रविष्टि तिथि:
09 JAN 2026 7:22PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా పీఎంవో ఇండియా ఇలా పేర్కొన్నది:
‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విచారకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ”
(रिलीज़ आईडी: 2213064)
आगंतुक पटल : 14