హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనవరి 8 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ‘‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’’లో పాల్గొనాల్సిందిగా దేశప్రజలకు విజ్ఞప్తి చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన మేరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వం: కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా

సనాతన సంస్కృతి శాశ్వతత్వాన్ని, పునరుజ్జీవన శక్తిని భవిష్యత్తు తరాలకు సందేశంగా

అందించేందుకే ‘‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’’

సోమనాథ్ ఆలయం జ్యోతిర్లింగం మాత్రమే కాదు.. సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక
గడచిన వెయ్యేళ్లలో అనేక దాడులను ఎదుర్కొన్నప్పటికీ తిరిగి పునర్వైభవాన్ని పొందిన సోమనాథ్ మహదేవ్ ఆలయం

మన నాగరికత శాశ్వతత్వానికి, ఓటమిని అంగీకరించిన దృఢ సంకల్పానికి ప్రతీక సోమనాథ్ ఆలయం

సోమనాథ్ ఆలయాన్ని నాశనం చేయాలని పయత్నించిన వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు

ఆలయం మాత్రం నేటికీ గొప్ప వైభవంతో అలరారుతోంది

प्रविष्टि तिथि: 08 JAN 2026 7:46PM by PIB Hyderabad

జనవరి నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ‘‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’లో పాల్గొనాలని దేశ ప్రజలకు కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని కేంద్ర హోంసహకార మంత్రి తెలియజేశారుసనాతన సంస్కృతి శాశ్వతత్వాన్నిపునరుజ్జీవన శక్తిని భవిష్యత్తు తరాలకు ఒక సందేశంగా ఈ ఉత్సవం నిలుస్తుందన్నారు.

‘‘జ్యోతిర్లింగాల్లో ఒకటిగా మాత్రమే కాకుండాచెక్కుచెదరని సనాతన సంస్కృతికిఆధ్యాత్మిక స్ఫూర్తికి సోమనాథ్ మహాదేవ్ ఆలయం ప్రతీకగడచిన వెయ్యేళ్లలో ఈ ఆలయం అనేక దాడులను ఎదుర్కొందిఅయినప్పటికీ.. ప్రతిసారి పునరుజ్జీవనం పొందిందిఇది మన నాగరికత శాశ్వతత్వాన్నిఎన్నటికీ ఓటమిని అంగీకరించని దృఢ సంకల్పాన్ని సూచిస్తుందిదీనిని నాశనం చేయాలని ప్రయత్నించినవారంతా తుడిచిపెట్టుకుపోయారుకానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ గొప్ప వైభవంతో అలరారుతోందిఇలాంటి దాడులు మనకు నష్టాన్ని కలిగించవచ్చేమో కానీ మనల్ని నాశనం చేయలేవనే విషయాన్ని సోమనాథ్ ఆలయ చరిత్ర చెబుతోందిఎందుకంటే.. ప్రతిసారి మరింత వైభవందైవత్వంతో పుంజుకోవడం సనాతన సంస్కృతికి ఉన్న సహజ లక్షణంసోమనాథ్ ఆలయంపై మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ నిర్ణయించారుసనాతన సంస్కృతి శాశ్వతత్వాన్నిపునరుజ్జీవన శక్తిని భవిష్యత్తు తరాలకు సందేశంగా చేరుతుందిఈ పవిత్ర ఆలయానికి ట్రస్టీగా ఉండటం నా అదృష్టంఈ రోజు నుంచి జనవరి 11 వరకు జరిగే ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ’లో పాల్గొనాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోస్టు చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2212937) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada