ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్‌ది శాశ్వత భూమిక.. సుభాషితం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 JAN 2026 8:44AM by PIB Hyderabad

పవిత్ర సోమనాథ్ ధామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్ పోషిస్తున్న శాశ్వత పాత్రను ఆయన ప్రస్తావించారు.
పావన సోమనాథ్ ధామం వందల ఏళ్లుగా తన దివ్య శక్తితో తరాల తరబడి స్ఫూర్తినిచ్చిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ శక్తి ఈనాటికీ విశ్వాసం, సాహసం, ఆత్మగౌరవాల మార్గాన్ని దర్శింపచేస్తోందనీ, యుగ యుగాలుగా భారతదేశ ప్రజలందరికీ ఓ దారిదీపంగా నిలుస్తోందనీ ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరిస్తూ - 
‘‘పావనమూ, పునీతమూ అయిన సోమనాథ్ ధామ భవ్య వారసత్వం శతాబ్దాల నుంచీ జన చేతనను జాగృతం చేస్తూ వస్తోంది. ఇక్కడి నుంచి ప్రసరిస్తున్న దివ్య శక్తి యుగ యుగాల వరకూ విశ్వాసం, సాహసం, స్వాభిమానాలనే దీపాన్ని ప్రజ్వలితం చేస్తూనే ఉంటుంది.
ఆదినాథేన శర్వేణ సర్వప్రాణిహితాయ వై
ఆద్యాతత్వాన్యథానీయం క్షేత్రమేతన్మహాప్రభమ్
ప్రభాసితం మహాదేవి యత్ర సిద్ధయన్తి మానవా:’’
అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2212934) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam