ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సమృద్ధ భారత్ సాధనకు సమగ్ర సంస్కరణలు ముఖ్యమని ప్రస్తావించిన ప్రధానమంత్రి భారత్‌లో రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోతోంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 07 JAN 2026 9:50PM by PIB Hyderabad

భారత్‌లో రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ జోరుగా పరుగుపెడుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు.పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న విస్తృత ప్రోత్సాహం, అవసరాలను తీర్చడమే ప్రధానంగా రూపొందిస్తున్న విధానాలు దేశాభివృద్ధికి ఒక కొత్త శక్తిని అందిస్తున్నాయని ఆయన అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన, తయారీ, డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు వివిధ సేవల అందజేత తో పాటు ‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యం’ వంటి రంగాల్లో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులతో సమృద్ధ భారత్ వైపు అడుగులు వేయాలన్న సంకల్సం సాకారమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక పునాదులను పటిష్ఠపరిచేలా, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా, అభివృద్ధి ఫలాలను దేశ పౌరులందరికీ అందించేలా ఈ సంస్కరణలను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘భారత్‌లో సంస్కరణల ఎక్స్‌ప్రెస్ నిరంతరం జోరందుకుంటోంది. దీనికి పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఎన్‌డీయే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్న విధానాల ఊతం లభిస్తోంది.
మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, తయారీ రంగంలో అందిస్తున్న ప్రోత్సాహకాలు కావచ్చు, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కావచ్చు లేదా ‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యం’ కావచ్చు.. మేం సమృద్ధ భారత్‌ను ఆవిష్కరించాలన్న మన కలను నిజం చేసే దిశగా నిరంతరాయంగా పని చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2212087&reg=3&lang=1

 

***


(रिलीज़ आईडी: 2212568) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam