ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో శాశ్వత సాంస్కృతిక చేతనపై వచ్చిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 JAN 2026 2:08PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
భారత చిరకాలిక సాంస్కృతిక చేతనకు సోమనాథ్ దేవాలయం ప్రతీకగా ఉందని శ్రీ మోదీ అన్నారు. ఇది గత 11 సంవత్సరాలుగా సోమనాథ్ మొదలు రామ జన్మభూమి వరకూ చోటుచేసుకున్న మార్పును ప్రస్ఫుటం చేస్తోందనీ, భారత్ తన సాంస్కృతిక గుర్తింపు పట్ల గర్విస్తున్న దేశంగా మారడాన్ని ప్రతిబింబిస్తోందనీ ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఆ వ్యాసాన్ని ప్రజలతో పంచుకుంటూ -
‘‘సోమనాథ్ దేవాలయం భారత శాశ్వత సాంస్కృతిక చేతనకు ప్రతీకగా ఉంది. గడచిన 11 సంవత్సరాల్లో సోమనాథ్ మొదలు రామ జన్మభూమి వరకూ చోటు చేసుకున్న మార్పు... భారత్ ఇప్పుడు తన సాంస్కృతిక గుర్తింపును చూసుకొని గర్విస్తున్న, ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న పరిపూర్ణ దేశంగా రూపొందిందనడానికి ఒక నిదర్శనంగా ఉంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి @JM_Scindia గారు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు..’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2212562)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam