ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిర్మాణాత్మకమైన, సాక్ష్యాధారితమైన చర్చ ప్రాధాన్యాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 JAN 2026 2:05PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

విధానాన్ని బలోపేతం చేసేసంస్కరణలను సమర్థించే విస్తృతమైనసాక్ష్యాధారిత విమర్శలను భారత్ స్వాగతిస్తుందనే ఆలోచనను ఈ కథనం ప్రతిబింబిస్తుందిభారతీయ ప్రజాస్వామ్య పురోగతిలో ద్వేషానికి తావు లేదని స్పష్టం చేస్తుందిఅలాగే కొత్త ఏడాదిలో ఒక వరంగా మారే నిర్మాణాత్మక చర్చల విలువను ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కథనాన్ని పంచుకుంటూ ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘విధానాలను బలోపేతం చేసేసంస్కరణలను సమర్థించే విస్తృతమైనసాక్ష్యాధారిత విమర్శలను భారత్ స్వాగతిస్తుందిమన ప్రజాస్వామ్య పురోభివృద్ధిలో ద్వేషానికి స్థానం లేదుకొత్త ఏడాదిలో వరంలా మారే నిర్మాణాత్మక చర్చల గురించి కేంద్ర మంతి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ @HardeepSPuri రాసిన ఈ కథనం వివరిస్తుంది.

దీనిని తప్పకుండా చదవండి!’’

 

(రిలీజ్ ఐడి: 2212559) సందర్శకుల సూచీ సంఖ్య : : 25