భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఐఐసీడీఈఎం-2026 నేపథ్యంలో సీఈవోలతో ఈసీఐ సమావేశం


ఐఐసీడీఈఎం-2026లో పాల్గొననున్న దాదాపు 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులు

ఐఐసీడీఈఎంలో 40కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు, 36 అనుబంధ చర్చా సదస్సులు

प्रविष्टि तिथि: 08 JAN 2026 1:05PM by PIB Hyderabad
  1. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ రోజు న్యూఢిల్లీలోని ఐఐఐడీఈఎంలో ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోలు) సమావేశాన్ని నిర్వహించింది. జనవరి 21 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడీఈఎం)కు సన్నాహకంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
  2. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ప్రసంగించారు. ఐఐసీడీఈఎం- 2026 ముఖ్యాంశాలను, నిర్దేశిత పాత్రలను వివరించారు.
  3. ప్రసంగం అనంతరం ఐఐసీడీఈఎం2026లో సంబంధిత సీఈవోలు నేతృత్వం వహించే 36 ప్రత్యేక బృందాల గురించి వారు చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలు ఆ ఇతివృత్తాల్లో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ సంస్థల విస్తృత, వైవిధ్యభరితమైన అనుభవాల ప్రాతిపదికన ఒక సమగ్ర జ్ఞాన కోశాన్ని అభివృద్ధి చేయడం వీటి లక్ష్యం.
  4. ఎన్నికల నిర్వహణ - ప్రజాస్వామ్య రంగంలో.. ఈ తరహాలో భారత్ నిర్వహించే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సుగా ఐఐసీడీఈఎం- 2026 నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థ (ఈఎంబీ)లకు చెందిన దాదాపు 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులతోపాటు.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, దేశంలోని విదేశీ దౌత్య కార్యాలయాల అధికారులు, ఎన్నికల రంగంలోని విద్యావేత్తలునిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
  5. ఐఐసీడీఈఎం-2026 సదస్సులో ప్రారంభ సమావేశంఎన్నికల నిర్వహణ సంస్థల అధినేతల ప్లీనరీఈఎంబీ వర్కింగ్ గ్రూపు సమావేశాలు, ఈసీఐనెట్ ప్రారంభోత్సవం వంటి సాధారణ, ప్రధాన సమావేశాలు ఉంటాయి. వీటితోపాటు అంతర్జాతీయ ఎన్నికల ఇతివృత్తాలుఅంతర్జాతీయ ఎన్నికల ప్రమాణాల నమూనాలు, ఎన్నికల ప్రక్రియల్లోని అత్యుత్తమ పద్ధతులు, వినూత్న ఆవిష్కరణలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు.
  6. ఈ సదస్సులో 4 ఐఐటీలు, 6 ఐఐఎంలు, 12 ఎన్ఎల్‌యూలుఐఐఎంసీ సహా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు పాల్గొంటాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సీఈవోలుజాతీయఅంతర్జాతీయ విద్యావేత్తలు నేతృత్వం వహించే 36 ప్రత్యేక బృందాలు కూడా ఈ చర్చల్లో పాలుపంచుకుంటాయి.

 

***


(रिलीज़ आईडी: 2212545) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Tamil